అమ్మా.. నీకిది తగునా!

12 Feb, 2017 02:37 IST|Sakshi
అమ్మా.. నీకిది తగునా!

మూడేళ్ల కుమార్తెకు ఒళ్లంతా వాతలు పెట్టిన తల్లి

చిట్టినగర్‌ (విజయవాడ పశ్చిమ):  విరోచనాలతో నీరసించిన బిడ్డ కు సపర్యలు చేయాల్సివస్తోందన్న కోపంతో కర్కశంగా మారిన ఓ తల్లి  అట్లకాడ కాల్చి తన  కుమార్తె ఒంటిపై 30కి పైగా వాతలు పెట్టింది. ఈ ఘటన శనివారం విజయవాడ పాత రాజరాజేశ్వరీ పేటలో జరిగింది. షౌకత్‌ అలీ,అస్మాబేగం దంపతులు,  కుమా రుడు ఖాజాబాబు (5), కుమార్తె షర్మిల (3)తో ఉంటున్నారు. అలీ నూడిల్స్‌ అమ్ముతూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు.  కొంతకాలం గా భార్యాభర్తల మధ్య వివాదాలు ఉన్నాయి. పోలీస్‌స్టేషన్‌ వరకు వెళ్లారు. పెద్దలు సర్దిచెప్పడంతో కలిసి  ఉంటున్నారు.

మరుగుదొడ్డి కడగాల్సి వస్తోందని...
రెండు రోజులుగా షర్మిలకు విరోచనాలు అవుతున్నాయి. పదేపదే మరుగుడొడ్డి శుభ్రం చేయాల్సి రావడంతో అస్మాబేగం విసుక్కునేది. శనివారం ఉదయం అలీ  మార్కెట్‌కు వెళ్లిన సమయంలో షర్మిల ఏడవడంతో విసిగిపోయిన అస్మాబేగం గ్యాస్‌ పొయ్యిపై అట్లకాడ కాల్చి రెండు తొడలు, పిరుదులు, మెకాళ్లపై వాతలు పెట్టింది.తర్వాత ఇంటికి వచ్చిన తండ్రితో షర్మిల  తల్లి చేసిన దుర్మార్గం  చెప్పింది. అలీ తన భార్యను నిలదీయడంతో పాటు కొత్తపేట పోలీసులకు ఫిర్యాదు చేశాడు.     కేసు నమోదుచేశారు.