ఏసీబీ వలలో అవినీతి చేప

14 Nov, 2013 02:57 IST|Sakshi
జీలుగుమిల్లి, న్యూస్‌లైన్ :ఏసీబీ వలలో మరో అవినీతి చేప చిక్కింది. ఓ రైతు తన పొలంలో విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ ఏర్పాటు కోసం దరఖాస్తు చేయగా, ఆ పని చేసేందుకు రూ.10 వేల లంచం డిమాండ్ చేసిన విద్యుత్ శాఖ జీలుగుమిల్లి ఏఈ ఎ.వెంకటేశ్వరరావును అవినీతి నిరోధక శాఖ అధికారులు వలపన్ని పట్టుకున్నారు.ఇలా ఉన్నాయి. జీలుగుమిల్లి మండలం తాటియాకుల గూడెంకు చెందిన గంధం వెంకటేశ్వరరావు అనే రైతు తన పొలంలో విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ ఏర్పాటు కోసం దరఖాస్తు చేసుకున్నాడు. ఇందుకోసం కొంతకాలంగా విద్యుత్ అధికారుల చుట్టూ తిరుగుతున్నాడు. 
 
 ఆ పని చేసిపెట్టాలంటే రూ.10 వేలు ఇవ్వాలని ఏఈ ఎ.వెంకటేశ్వరరావు డిమాండ్ చేయగా, మంగళవారం రూ.2 వేలు అతనికి ముట్టజెప్పినట్టు రైతు గంధం వెంకటేశ్వరరావు తెలిపాడు. మిగిలిన రూ.8 వేలను బుధవారం ఇస్తానని చెప్పిన రైతు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. ఏసీబీ డీఎస్పీ ఐ.వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో రంగంలోకి దిగిన ఆ శాఖ అధికారులు విద్యుత్ ఏఈ కోసం వలపన్నారు. రూ.8వేలను రైతు వెంకటేశ్వరరావుకు ఇచ్చి ఏఈ వద్దకు పంపించారు. ఆ మొత్తాన్ని ఏఈ తీసుకుం టుండగా రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అతని నుంచి వివరాలు రాబట్టిన అనంతరం అరెస్ట్ చేశారు. కాగా, ఏసీబీ అధికారులకు చిక్కిన ఏఈ వెంకటేశ్వరరావు ఐదు నెలల క్రితమే కొయ్యలగూడెం నుంచి జీలుగుమిల్లికి బదిలీపై వచ్చారు.
 
మరిన్ని వార్తలు