ఏసీబీ వలలో ఎంపీడీఓ

19 Apr, 2018 10:51 IST|Sakshi
నగదుతో ఎంపీడీఓ మాణిక్యరావు

పదివేలు లంచం తీసుకుంటూ పట్టుబడిన త్రిపురాంతకం ఎంపీడీఓ

త్రిపురాంతకం : స్థానిక ఎంపీడీఓ కె. మాణిక్యరావు ఏసీబీ వలలో చిక్కారు. పదివేలు నగదు తీసుకుంటుడగా పట్టుబడ్డారు. బిల్లులు ఇవ్వకుండా నెలలు తరబడి తిప్పుతుండటంతో బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. దూపాడు పంచాయతీ పరిధిలని హసానపురం గ్రామానికి చెందిన ఎనిబెర భిక్షాలు ఫెర్క్యులేషన్‌ ట్యాంకు పనులకు గత ఏడాది మే నెలలో వర్క్‌ ఆర్డర్‌ తసుకుని మూడు నెలల వ్యవధిలో పూర్తి చేశాడు. దీనికి సంబంధించి రూ. 1.52 లక్షల మెటీరియల్‌కు బిల్లులు రావాల్సి ఉంది. దీంతో ఉపాధి హామీ టెక్నికల్, ఫీల్డ్‌ అసిస్టెంట్, ఇంజినీరింగ్‌ అధికారులు గత ఏడాది జూలై 23న బిల్లులు చెల్లించాలని రికార్డులు, ఎం బుక్‌లను అధికారులకు సమర్పించారు.

అయితే అప్పటి నుంచి ఎంపీడీఓ.. భిక్షాలును బిల్లుల కోసం తిప్పుతూ కాలయాపన చేస్తున్నాడు. తాను పేదవాడినని లంచాలు ఇవ్వలేనని.. వడ్డీలకు అప్పుతెచ్చి ఈపని చేశానని ప్రాథేయపడినా తనకు పర్సంటేజీ ఇస్తేనే బిల్లు చేస్తానని ఎంపీడీఓ మాణిక్యరావు తేల్చి చెప్పాడు. దీంతో ఏసీబీని బాధితుడు ఆశ్రయించినట్లు డీఎస్పీ తోట ప్రభాకర్, సీఐ ప్రతాప్‌ తెలిపారు. అధికారులు పథకం రచించారు. భిక్షాలు పదివేల రూపాయలను (ఐదువందల నోట్లు) ఎంపీడీఓ మాణిక్యరావుకు ఇస్తుండగా రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. నగదుతో పాటు వర్క్‌కు సంబంధించిన రికార్డులను స్వాధీనం చేసుకుని, ఎంపీడీఓ మాణిక్యరావును అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. ఎవరైనా అధికారులు ఇలా ఇబ్బందులు పెడుతుంటే తమకు సమాచారం అందించాలని కోరారు.

మరిన్ని వార్తలు