‘మంత్రి వ్యాఖ్యలపై నేను మాట్లాడను’

1 Nov, 2019 15:02 IST|Sakshi

సాక్షి, విజయవాడ : డబ్బులు తీసుకోవడం మాత్రమే అవినీతి కాదని, ఇవ్వడం కూడా అవినీతేనని ఏసీబీ డీజీ విశ్వజిత్‌ కుమార్‌ స్పష్టం చేశారు. శుక్రవారం స్థానిక కానూరు సిద్దార్ధ కాలేజీలో నిర్వహించిన విజిలెన్స్‌ వారోత్సవాల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా విశ్వజిత్‌ మాట్లాడుతూ.. ‘మానసిక ఆలోచనలు, చేసే పనిలో నిబద్ధత, నీతి లేకపోవడం కూడా అవినీతే. ఈ రోజుల్లో చాలా మంది తమ పనులు తొందరగా పూర్తవ్వాలని లంచాలు ఇస్తున్నారు. మరోవైపు సమాజంలో స్వప్రయోజనాలు పెరిగిపోయాయి. దీని వల్ల వ్యవస్థలో అవినీతి పెరిగిపోయింది. క్యాన్సర్‌ లాంటి అవినీతిని ప్రోత్సహించడం మంచి పద్ధతి కాదు. దీనిపై విద్యార్థి దశ నుంచే అవగాహన కల్పించాలి.

ప్రజలు లంచాలు ఇవ్వడం ఎప్పడైతే మానుకుంటారో అప్పుడు అవినీతి అంతమవుతుంది. రాష్ట్రంలో అవినీతి రహిత పాలన ఉండాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి సంకల్పం. అవినీతికి పాల్పడే అధికారులను ఉపేక్షించే ప్రసక్తే లేద’ని పేర్కొన్నారు. విశాఖ ఘటనపై మాట్లాడుతూ.. మధురవాడలో ఏసీబీ అధికారులపై వచ్చిన ఆరోపణలపై  ఏసీబీ జాయింట్‌ డైరెక్టర్‌ మోహన్‌రావు విచారణ చేస్తున్నారు. ఆయన ఇచ్చే నివేదిక ఆధారంగా ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారులపై చర్య తీసుకుంటాం. మంత్రి చేసిన వ్యాఖ్యలపై నేను మాట్లాడనంటూ ముగించారు.   

మరిన్ని వార్తలు