విచారణ షురూ?

6 Jun, 2019 10:36 IST|Sakshi

ఎస్బీ పోలీసు ఎదుర్కొంటున్న ఆరోపణలపై ఏసీబీ దృష్టి

త్వరలో విచారణకు ఆదేశించేందుకు సిద్ధమవుతున్న ప్రభుత్వం

సాక్షి, చిత్తూరు: నగరంలోని స్పెషల్‌ బ్రాంచ్‌ (ఎస్బీ) పోలీసు ఎదుర్కొంటున్న ఆరోపణలపై ఏసీబీ దృష్టి సారిం చింది. ఇసుక మొదలు.. గ్రానైట్‌ వరకు ప్రతి అవినీతి పని లోనూ వాటాల రూపంలో ఆయన భారీ మొత్తంలో వసూళ్లకు పాల్పడ్డారు. జిల్లాలోని ప్రతి గ్రానైట్‌ వ్యాపారి, గ్రా నైట్‌ ఫ్యాక్టరీ ఓనర్ల నుంచి నెలవారీ మామూళ్లు వసూలు చేశారు. ఇవ్వని వారిపై కేసులు నమోదు చేసి, కక్ష సాధింపు ధోరణి అవలంబించారని వ్యాపారులు అంటున్నారు.

ఉన్నతాధికారి అండతో..
అప్పటి ఎస్బీ ఉన్నతాధికారి అండతో ఆ పోలీసు చెలరేగి పోయారు. జిల్లాలో వసూళ్లను ఆ ఉన్నతాధికారికి వాటా ఇచ్చేవారు. దీంతో ఆయన ఆ పోలీసుల అవినీతిని చూసీ చూడనట్లు వదిలేశారు. చిత్తూరు చుట్టుపక్కల ఇసుక తవ్వకాలు జరిపే అక్రమార్కుల నుంచి భారీ మొత్తాల్లో సేకరించారు. ఈ అక్రమార్జనతో ఆ ఉన్నతాధికారి, పోలీసు పెద్ద ఎత్తున భూములు కొనుగోలు చేశారని ఏసీబీ అ«ధికారులు గుర్తించారు.

వివరాలు ఇచ్చేందుకు సిద్ధం..
ఎస్బీ పోలీసు అక్రమ వసూళ్ల  వివరాలు ఏసీబీకి ఇచ్చేం దుకు సిద్ధంగా ఉన్నామని గ్రానైట్‌ వ్యాపారులు అంటున్నారు. ప్రతి నెలా ఒక్కొక్క గ్రానైట్‌ క్వారీ నుంచి ఆయనకు రూ.2లక్షల నుంచి రూ.4 లక్షల వరకు ఇచ్చుకున్నామని, వీటిపై పక్కా ఆధారాలతో సహా ఏసీబీకి ఇస్తామని వారు చెబుతున్నారు. అక్కడక్కడ జరుగుతున్న లాటరీ, మట్కా నిర్వాహకుల నుంచి వసూళ్లకు పాల్పడ్డారు.

జిల్లా ఎస్బీ శాఖలో అవినీతిపై..
జిల్లాలో ఎస్బీ శాఖ చేసిన అవినీతిపై ప్రభుత్వం సీరియస్‌ అయ్యింది. ఐజీ స్థాయిలో విచారణ జరపడానికి రంగం సిద్ధమైంది. త్వరలో ఆదేశాలు వచ్చే అవకాశం ఉంది. ఇం తలోగా ఏసీబీ కూడా రంగంలోకి దిగబోతోందని తెలుస్తోం ది. దీంతో అప్పట్లో ఇక్కడ అధికారం చెలాయించిన వారి గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. 

మరిన్ని వార్తలు