అచ్చెన్నాయుడు లేఖ ఆధారంగానే కాంట్రాక్టులు

13 Jun, 2020 11:51 IST|Sakshi

సాక్షి, అమరావతి : మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడి లేఖ ఆధారంగానే టెలీహెల్త్‌కు కాంట్రాక్టులు ఇచ్చారని ఏసీబీ జేడీ రవికుమార్ తెలిపారు. ఈఎస్‌ఐ స్కామ్‌లో దర్యాప్తు కొనసాగుతోందని, ఈ కేసులో ఇంకా చాలా మందిని విచారించాల్సి ఉందని వెల్లడించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఈఎస్‌ఐ స్కామ్‌లో అచ్చెన్నాయుడుతో పాటు ఏడుగురిని అరెస్ట్‌ చేశామన్నారు. రూ.150 కోట్లు అవినీతి జరిగినట్లు ప్రాథమికంగా నిర్ధారణ అయ్యిందన్నారు. అచ్చెన్నాయుడు, రమేష్‌కుమార్‌ను న్యాయమూర్తి ముందు హాజరుపరిచామని, న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్‌ విధించారని తెలిపారు. అచ్చెన్నాయుడు ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా ఆస్పత్రికి తరలించామని వెల్లడించారు. మిగతా ఐదుగురిని నేడు జడ్జి ముందు హాజరుపరుస్తామన్నారు. ( అచ్చెన్న.. ఖైదీ నెంబర్‌ 1573 )

నిలకడగా అచ్చెన్నాయుడి ఆరోగ్యం
గుంటూరు : అచ్చెన్నాయుడి ఆరోగ్యం నిలకడగానే ఉందని జీజీహెచ్ సూపరింటెండెంట్ సుధాకర్ తెలిపారు. అచ్చెన్నాయుడి ఆపరేషన్ గాయానికి చికిత్స అందిస్తున్నామని చెప్పారు. సుదీర్ఘ ప్రయాణం చేయడంతో గాయం పచ్చిగా మారిందని, గాయం తగ్గడానికి రెండు మూడు రోజులు పట్టొచ్చని అన్నారు. బీపీకి ఇదివరకు వాడుతున్న మందులే కొనసాగిస్తున్నామని, షుగర్ నార్మల్‌గానే ఉందని వెల్లడించారు.

>
మరిన్ని వార్తలు