వసతి గృహాలకు పెద్దపీట

26 Apr, 2014 01:58 IST|Sakshi

కాళ్ల, న్యూస్‌లైన్: మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో విద్యతోపాటు వసతిగృహాల నిర్మాణానికి అధిక ప్రాధాన్యమిచ్చారు. శిథిలావస్థకు చేరిక హాస్టళ్ల స్థానంలో అధునాతన సౌకర్యాలతో కూడిన భవనాలను నిర్మించారు. ఈ కోవకు చెందుతుంది కాళ్లలోని బాలికల సమీకృత వసతి గృహం (ఇంటిగ్రేటెడ్ హాస్టల్). కాళ్ల మండలంలో కాళ్ల, బొండాడలో బాలికల వసతి గృహాలు ఉండేవి.

 

వీటిలో ఈ ప్రాంతంతో పాటు కృష్ణా జిల్లాలోని శివారు గ్రామాలకు చెందిన బాలికలు వసతి పొందేవారు. అయితే ఇక్కడ హాస్టళ్లకు సొంత భవనాలు లేకపోవడంతో విద్యార్థినులు అవస్థలు పడేవారు. 2007లో అప్పటి ఎమ్మెల్యే పాతపాటి సర్రాజు ఈ విషయాన్ని మహానేత వైఎస్సార్ దృష్టికి తీసుకువెళ్లారు. వెంటనే స్పందించిన మహానేత కాళ్లలో ఇంటిగ్రేటెడ్ హాస్టల్ నిర్మాణానికి రూ.1.68 కోట్ల నిధులు మంజూరుచేశారు.

 

2008 జనవరిలో ఈ హాస్టల్ నిర్మాణ ప్రారంభమైంది. ఎనిమిది విశాలమైన గదులు, డైనింగ్‌హాల్, కిచెన్ హాల్, వెయిటింగ్ రూమ్, ఆఫీస్ రూమ్ వంటి అత్యాధునిక సౌకర్యాలతో హాస్టల్ రూపుదిద్దుకుంది. ఇది గ్రామంలో వైఎస్ ముద్రగా నిలిచిపోయింది.

మరిన్ని వార్తలు