‘సచివాలయ’ ఉద్యోగాలకు ఆన్‌లైన్‌ ఆమోదం

30 Sep, 2019 19:44 IST|Sakshi

పంచాయతీ రాజ్‌ శాఖ కమిషనర్‌ గిరిజా శంకర్‌

సాక్షి, అమరావతి: గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాలు పొందిన వారు ఆన్‌లైన్‌లో ఆమోదం తెలపాలని పంచాయతీ రాజ్‌ శాఖ కమిషనర్‌ గిరిజా శంకర్‌ తెలిపారు. ఉద్యోగ అంగీకార పత్రాన్ని గ్రామ సచివాలయ వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ చేయాలన్నారు. ఒకటి కంటే ఎక్కువ ఉద్యోగాలు పొందిన వారు ఒక ఉద్యోగాన్ని మాత్రమే ఎంపిక చేసుకోవాలన్నారు. ఏ ఉద్యోగాన్ని ఎంపిక చేసుకున్నారో ఆన్‌లైన్‌లో ఆప్షన్‌ ఇవ్వాలని సూచించారు. ఉద్యోగం పొందిన వారు ఏ మండలంలో పనిచేస్తారో కూడా వెబ్‌సైట్‌లో తెలపాలన్నారు. ఉద్యోగానికి ఎంపికయిన ప్రతిఒక్కరూ విధిగా వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ చేయాలని తెలిపారు.
(చదవండి: ప్రతీ ఏటా ఉద్యోగ నోటిఫికేషన్‌: సీఎం జగన్‌

మరిన్ని వార్తలు