డ్రగ్స్ నిరోధానికి చర్యలు: డీజీపీ

20 Jan, 2014 00:54 IST|Sakshi
డ్రగ్స్ నిరోధానికి చర్యలు: డీజీపీ

ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపిన డీజీపీ
 సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో మాదక పదార్థాల (డ్రగ్స్) నిరోధానికి చేపట్టాల్సిన చర్యలపై ప్రభుత్వానికి డీజీపీ బి.ప్రసాదరావు పలు కీలకమైన ప్రతిపాదనలు పంపారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం... ప్రస్తుతం సీఐడీలో ఉన్న నార్కోటిక్ సెల్‌కు మరింతగా జవసత్వాలు కల్పించాలని, ప్రత్యేక విభాగం (యూనిట్)గా గుర్తించాలని ప్రభుత్వాన్ని కోరారు. డ్రగ్ మాఫియా కార్యకలాపాలను అరికట్టడానికి పోలీసులు చర్యలు తీసుకుంటున్నప్పటికీ రాష్ట్ర స్థాయిలో పకడ్బందీగా ఒక విభాగం అవసరమని తెలిపారు.
 
  మాదక పదార్థాల నిరోధక చట్టం పటిష్ట అమలుకు సీఐడీలోప్రత్యేకంగా నార్కోటిక్ సెల్ ఉన్నప్పటికీ అధికారులు, సిబ్బంది కొరత ఉందని వెల్లడించారు. మత్తు పదార్థాల రవాణా, విక్రయాలకు పాల్పడే  ముఠాలపై నిఘాకు సిబ్బంది అవసరమని వెల్లడించారు. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలతో పాటు కొన్ని జిల్లాల్లో నైజీరియన్ల తరహా ముఠాలు మాదక పదార్థాల స్మగ్లింగ్‌కు పాల్పడుతున్నాయని, నిరంతర నిఘా లేక ఆ కార్యకలాపాలు కొనసాగిస్తున్నాయని వివరించారు. ప్రతి జిల్లాలో నార్కోటిక్ సెల్‌లను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని డీజీపీ ప్రసాదరావు ప్రభుత్వానికి నివేదించారు.

మరిన్ని వార్తలు