రోడ్డు ప్రమాదం: అలీ సోదరుడికి గాయాలు

25 Dec, 2013 11:05 IST|Sakshi

హయత్నగర్ మండలం కోహెడ్ వద్ద బుధవారం ఉదయం స్కార్పియో వాహనాన్ని టిప్పర్ ఢీ కొట్టింది. ఆ ఘటనలో ప్రముఖ హాస్య నటుడు అలీ సోదరుడు ఖయ్యుమ్కు గాయాలయ్యాయి. దీంతో అదే రహదారిపై వెళ్తున్న స్థానికులు వెంటనే స్పందించారు. స్కార్పియోలో చిక్కుకున్న ఖయ్యుమ్ను బయటకు తీసి మలక్ పేటలోని  యశోదా  ఆసుపత్రికి తరలించారు.

 

పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని టిప్పర్ డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నారు. అతడిపై కేసు నమోదు చేశారు. స్కార్పియో వాహనంలో ఖయ్యుమ్ మరో వ్యక్తి హైదరాబాద్ లోని రామోజీ ఫిల్మ్ సిటీలో షూటింగ్ పూర్తి చేసుకుని వస్తుండగా ఆ ఘటన చోటు చేసుకుందని పోలీసులు తెలిపారు. మరో వ్యక్తికి కూడా తీవ్ర గాయాలయ్యాయని అతడిని కూడా అదే ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు