విశాఖలో రాజధానిని స్వాగతిస్తున్నా: నటుడు

25 Dec, 2019 16:19 IST|Sakshi

సాక్షి, విశాఖపట్నం: విశాఖపట్నం కేంద్రంగా కార్యనిర్వాహక రాజధాని, కర్నూలులో హైకోర్టు ఏర్పాటు నిర్ణయాన్ని తాము స్వాగతిస్తున్నామని బుధవారం సినీ నటుడు ఆర్.నారాయణమూర్తి స్పష్టం చేశారు. మద్రాసు రాష్ట్రంలో ఆంధ్ర విశ్వవిద్యాలయం ఏర్పాటు తర్వాత కర్నూలు నుంచి రాజధాని హైదరాబాద్‌కు తరలిపోవడంతో రాయలసీమ నష్టపోయిందనే భావం నుంచి ఇప్పుడు బయట పడుతున్నారని అన్నారు. శ్రీకృష్ణ కమిటీ ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర విభజన సమయంలో సూచించిన అంశాలను ఇప్పుడు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అమలుపరుస్తున్నారని తెలిపారు.

చదవండి: విశాఖలో రాజధానిని స్వాగతిస్తున్నాం: టీడీపీ నేత

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు