హోంమంత్రి అదనపు కార్యదర్శిగా రమ్యశ్రీ

15 Aug, 2019 09:19 IST|Sakshi

సాక్షి, నాదెండ్ల: రాష్ట్ర హోంమంత్రి మేకతోటి సుచరితకు అదనపు కార్యదర్శిగా అద్దంకి రమ్యశ్రీ నియమించబడ్డారు. ఆమె నాదెండ్ల మండల పరిషత్‌ అభివృద్ధి అధికారిగా విధులు నిర్వహిస్తున్నారు. ఈ మేరకు ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు రావటంతో బుధవారం రిలీవ్‌ అయ్యారు. రమ్యశ్రీ ఇటీవలే నాదెండ్లకు బదిలీపై ఎంపీడీవోగా వచ్చారు. ఈ సందర్భంగా ఆమెను కార్యాలయ సిబ్బంది, వివిధ శాఖల అధికారులు అభినందించారు. 

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా