'మరింత పకడ్బందీగా లాక్‌డౌన్‌ను అమలుచేస్తాం'

7 Apr, 2020 17:31 IST|Sakshi

సాక్షి, వైఎస్సార్‌ : జిల్లాలో కరోనా వ్యాప్తి చెందకుండా అన్ని నివారణ చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా ఇన్‌చార్జ్‌, విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్‌ పేర్కొన్నారు. జిల్లాలో కరోనాకు సంబంధించి టెస్టింగ్‌ ల్యాబ్‌ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అర్హత కలిగిన రేషన్‌కార్డుదారులకు వెయ్యి రూపాయల పంపిణీ కార్యక్రమం విజయవంతంగా జరుగుతుందన్నారు. లాక్‌డౌన్‌ను మరింత పకడ్బందీగా అమలు చేసేందుకు  పోలీసులకు తగిన ఆదేశాలు జారీ చేశామని వెల్లడించారు. నియోజకవర్గస్థాయిలోనూ టాస్క్‌ఫోర్స్‌ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కరోనాపై అన్ని రకాలుగా చర్యలు తీసుకుంటున్నా ప్రతిపక్షాలు రాద్ధాంతం చేస్తున్నాయని మండిపడ్డారు. అలాగే నాడు-నేడు పథకంపై కూడా ప్రతిపక్షాలు ఆరోపణలు చేయడం బాధాకరం అని పేర్కొన్నారు. ప్రతి విద్యార్థి ఇంటి వద్దకు భోజనంలో ఇచ్చే గుడ్లు, చెక్కులను వలంటీర్ల ద్వారా పంపిస్తామన్నారు. సామాజిక దూరంతోనే కరోనా నివారణ సాధ్యమని, పదవ తరగతి పరీక్షలను ఎప్పుడు నిర్వహించాలనేది త్వరలోనే నిర్ణయించి షెడ్యూల్ ప్రకటిస్తామని సురేశ్‌ తెలిపారు.  

>
మరిన్ని వార్తలు