రాష్ట్ర ప్రగతిపై సీఎం సమక్షంలో మేధోమథనం

21 May, 2020 04:53 IST|Sakshi

ఏడాది పాలనపై 25 నుంచి ఐదు రోజులపాటు సమీక్షలు

విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ 

సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రగతిపై ఈ నెల 25వ తేదీ నుంచి సీఎం వైఎస్‌ జగన్‌ నేతృత్వంలో మేధోమథన సమీక్షలు జరుగుతాయని విద్యా శాఖ మంత్రి సురేష్‌ తెలిపారు. సచివాలయంలోని తన చాంబర్‌లో విద్యా శాఖ ఉన్నతాధికారులతో బుధవారం సమీక్ష నిర్వహించారు. విద్యా శాఖ లో చేపట్టిన సంస్కరణలు, సంక్షేమ కార్యక్రమాలు, విద్యా సంస్థల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధి తదితర అంశాలను  ప్రజల్లోకి ఎలా తీసుకెళ్లాలన్న అంశంపై సూచనలు చేశారు. మంత్రి ఏమన్నారంటే..

► మేధోమథన కార్యక్రమం మొత్తం 5 రోజులు జరుగుతుంది. తొలి రోజున వ్యవసాయం, రెండో రోజు విద్యాశాఖ, మూడో రోజు  వైద్య ఆరోగ్య శాఖ, నాలుగో రోజు గ్రామ/వార్డు వలంటరీ వ్యవస్థ, చివరి రోజున ప్రణాళిక విభాగానికి  చెందిన శాఖలతో సమీక్ష జరుగుతుంది. ఈ కార్యక్రమ నిర్వ హణపై సీనియర్‌ అధికారి చైర్మన్‌గా ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేయాలి. మేధో  సమీక్షలు చైర్మన్, కమిటీ సభ్యుల పర్యవేక్షణలోనే జరుగుతాయి.
► సీఎం ఆలోచనలకు అను గుణంగా కార్యక్రమాలకు రూపకల్పన చేయాలి. 
► నవరత్నాలలో విద్యా నవరత్నాలుగా అమలు చేస్తున్న అమ్మ ఒడి, పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పన, విద్యా ప్రమాణాల పెంపు, ఆంగ్ల మాధ్యమ విద్య, మాతృ భాషా వికాసం, మధ్యాహ్న భోజన పథకం, పాఠ్య పుస్తకాలు, యూనిఫామ్, పాదరక్షల పంపిణీ, నైపుణ్యాభివృద్ధి వంటి అంశాలపై దృష్టి సారించండి
► విద్యా ప్రమాణాల పెంపునకు వీలుగా, నిబంధనలకు అనుగుణం గా ప్రైవేటు విద్యాసంస్థలు నడిచేలా నియం త్రించేందుకు రెగ్యులేటరీ కమి షన్ల ఏర్పాటు,  పూర్తి స్థాయిలో ఉపా ధ్యాయులు, అధ్యాపకుల నియామకం వంటి అంశాలపైనా సమీక్ష ఉంటుంది.
► సమావేశంలో విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి బి.రాజశేఖర్, పాఠశాల విద్యా శాఖ కమిషనర్‌ చిన వీరభద్రు డు, కళాశాల సాంకేతిక విద్య కమిష నర్‌ నాయక్, ఆంగ్ల విద్య ప్రత్యేక అధికారి వెట్రి సెల్వి, రాష్ట్ర ఉన్నత విద్యా మండలి చైర్మన్‌ ప్రొఫెసర్‌ హేమచంద్రారెడ్డి పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు