డీజీటీ దెబ్బతో ప్రాజెక్టుకు‘టాటా’

15 Jun, 2019 09:42 IST|Sakshi

పర్సంటేజీల కోసం ఏకమైన గుండ్లకుంట–దేవగుడి

ఫిఫ్టీఫిఫ్టీ వాటాలతో చేపట్టిన  పనులు

కాంట్రాక్టర్లను ముప్పుతిప్పలు పెట్టిన టీడీపీ నేతలు

సబ్‌స్టేషన్‌ నిర్మాణ పనులు అడ్డగింత

3శాతం ముట్టజెప్పితేనే పనులంటూ హుకుం

తమవల్ల కాదని నిష్క్రమించిన టాటా సంస్థ

గురివింద గింజ సామెతను గుర్తు చేస్తోందిజమ్మలమడుగు టీడీపీ నేతల తీరు. తమకుకప్పం చెల్లించకుండా పనులు జరపడానికి వీల్లేదంటూ గతంలో హుకుం జారీ చేసిన నాయకులునేడు స్వరం మార్చారు. అధికార పార్టీపై ఎదురుదాడికి దిగుతున్నారు.  సగం సగం వాటాలతోఅభివృద్ధి పనులు పంచుకుని కాంట్రాక్టర్లనుముప్పుతిప్పలు పెట్టిన వైనాన్ని విస్మరించివింత ఆరోపణలను చేస్తున్నారు.జమ్మలమడుగులో టీడీపీ నేతలు ప్రవేశపెట్టిన డీజీటీ (దేవగుడి– గుండ్లకుంట ట్యాక్స్‌)చెల్లించలేక లేక ఏకంగా ఓ ప్రసిద్ధసంస్థవెనక్కివెళ్లిపోయింది.

సాక్షి ప్రతినిధి కడప: గుంటూరు జిల్లాలో కేట్యాక్స్‌ (కోడెల ట్యాక్స్‌) తరహానే  జమ్మలమడుగులో టీడీపీ నాయకులు డీజీ ట్యాక్స్‌ ప్రవేశ పెట్టారు. కేంద్ర ప్రభుత్వం జీఎస్‌టీ ప్రవేశ పెడితే స్థానిక నాయకులు ఆయా ప్రాంతాల్లో  తమకు అనువైన ట్యాక్స్‌లు అమలుచేశారు. జమ్మలమడుగులో అభివృద్ధి పనులు చేపట్టాలంటే దేవగుడి–గుండ్లకుంట ట్యాక్స్‌ చెల్లించాల్సిందే. చెల్లించకపోతే పనులు చేయడం కష్టమే. ఇలాంటి తంతు గడిచిన మూడేళ్లుగా కొనసాగింది. అప్పటి ప్రభుత్వం ప్రవేశపెట్టిన నీరు–చెట్టు పథకం మొదలుకొని ఎలాంటి పనులు చేపట్టినా  50@50వాటాలతో చెపట్టాల్సిందే. ఇలాంటి ఒప్పందం ఏకంగా అప్పటి ప్రభుత్వ పెద్దే కుదిర్చారు. అదే విషయాన్ని తమ అనుచరులకు టీడీపీ నేతలు స్వయంగా తెలియజేశారు. ఆమేరకు అన్నీంటా చక్రం తిప్పుతూ వచ్చిన తెలుగుదేశాధీశులు తమను కాదన్నవారిని కాంట్రాక్టు పనులు చేయనిచ్చేవారు కాదు. టాటా ప్రాజెక్ట్సు విషయంలో ఈ విషయం తేటతెల్లమైంది.

3శాతం కమీషన్‌ ఇస్తేనే చేయిస్తాం..
జమ్మలమడుగు పరిసర ప్రాంతాలు విద్యుత్‌ ఉత్పత్తికి అనువుగా ఉండడంతో పారిశ్రామిక వేత్తలంతా దృష్టిసారించారు. 82మెగా వాట్లు విండ్‌ పవర్, 1000 మెగా వాట్లు సామర్థ్యం సోలార్‌ పవర్‌ ఫ్లాంట్లు ఏర్పాటు చేశారు. వీటి నుంచి ఉత్పత్తయ్యే విద్యుత్‌ను ట్రాన్సుమిషన్‌ కార్పొరేషన్‌కు బదలాయించేందుకు మైలవరం సమీపంలో 400/220 కేవీ సబ్‌స్టేషన్, 10.5కిలోమీటర్లు మెయిన్‌ లైన్‌ నిర్మించదలిచారు. దీనిని రూ.149.05కోట్లు అంచనా వ్యయంతో చేపట్టేందుకు గతేడాది మార్చిలో ఈప్రోక్యూర్‌మెంట్‌ ద్వారా టెండర్లు ఆహ్వానించారు. ఉత్తరప్రదేశ్‌లోని నోయిడాకుచెందిన టాటా ప్రాజెక్ట్‌ 1.01శాతం తక్కువ రేట్లుకు కోట్‌ చేసి, రూ.147.55కోట్లకు  సబ్‌స్టేషన్‌ నిర్మాణ పనుల టెండర్లను దక్కించుకుంది. అనంతరం పనులు చేసేందుకు అగ్రిమెంట్‌ చేసుకుంది.  400కెవీ సబ్‌సేష్టన్, ఏపీ ట్రాన్సుకో, విజయవాడతో ఎల్‌ఓఐ ఇచ్చింది. కానీ క్షేత్రస్థాయిలో పనులు చేయడం టాటా ప్రాజెక్ట్‌కు కష్టతరమైంది. ఇక్కడ పనులు చేయాలంటే మూడు శాతం కమీషన్‌ చెల్లించాలని(దేవగుడి–గుండ్లకుంట ట్యాక్స్‌), అలా చెల్లిస్తేనే పనులు చేయిస్తామని కాంట్రాక్టర్‌కు హుకుం జారీ చేశారు.  లెస్‌ మొత్తంతో పనులు దక్కించుకుంటే మరో మూడుశాతం (సుమారు రూ.4.5కోట్లు) డీజీటీ చెల్లించడం కష్టతరం కావడంతో టాటా ప్రాజెక్ట్‌ సబ్‌ స్టేషన్‌ నిర్మాణానికి ఆసక్తి చూపలేదు. ఇలాంటి విపత్కర పరిస్థితులు జమ్మలమడుగులో గడిచిన కొంతకాలంగా తిష్టవేశాయి.

గుర్తుకు వస్తున్న గురివింద గింజ సామెత...
పరస్పర ఫ్యాక్షన్‌ రాజకీయాలు నడిపిన నేతలు పర్సెంటేజీల కోసం ఏకమయ్యారు. పట్టుమని పది రోజులు కూడా గడవకముందే అధికార వైఎస్సార్‌సీపీ నాయకులు బెదిరింపులకు పాల్పడుతున్నారని మాజీ మంత్రి రామసుబ్బారెడ్డి మీడియా ముందుకు వచ్చారు. వాస్తవంలో టీడీపీ నేతలు బెదిరింపులకు, కమీషన్లు కక్కుర్తీకి కాంట్రాక్టర్లు దూరమైయ్యారని టాటా ప్రాజెక్ట్‌ వ్యవహారం బహిర్గతం చేస్తోంది. మూడేళ్లు అక్కడ ఎలాంటి అభివృద్ధి చేపట్టాలన్నా సగం సగం వాటాలతో పంచుకుంటున్న నేపథ్యం అక్కడి ప్రజలకు ఎరుకే. అయినా ప్రత్యర్థిపార్టీ నేతలపై ఆరోపణలు చేయడం వింతగా ఉందని రాజకీయ పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు.

ఫిప్టీ..ఫిప్టీ నేతలు వారే: జమ్మలమడుగులో చేపట్టే పనుల్లో ఫిప్టీ...ఫిప్టీ వాటాలతో మాజీ మంత్రులు ఆదినారాయణరెడ్డి, రామసుబ్బారెడ్డిలు పనులు పంచుకున్నారు. సోలార్‌ ప్రాజెక్ట్‌ నిర్మాణంలో స్థానిక రైతుల సమస్యలను విస్మరించి, ఇరువురు నాయకులు కుమారులు సగం, సగం పనలు చేసేలా హైదరాబాద్‌ తాజ్‌ బంజారా హోటల్‌లో పంచుకున్నారు. ప్రతి పనిలో ఇలాంటి పోకడతోనే వ్యవహారించారు. 400/220కెవీ విద్యుత్‌ సబ్‌స్టేషన్‌ నిర్మాణం కోసం కాంట్రాక్టర్‌ టెంకాయ కూడా కొట్టారు.వీరికి 3శాతం కమీషన్‌ రూపంలో ఇవ్వలేదని అధికారాన్ని అడ్డుపెట్టుకొని పనులు అడ్డగించారు. వాస్తవ పరిస్థితి ఇలా ఉంటే మాజీ మంత్రి రామసుబ్బారెడ్డి శ్రీరంగనీతులు వల్లిస్తున్నారు. – ఎమ్మెల్యే డాక్టర్‌ సుధీర్‌రెడ్డి

మరిన్ని వార్తలు