అదిరేటి డ్రస్సు మేమేస్తే..

21 Jul, 2014 03:51 IST|Sakshi
అదిరేటి డ్రస్సు మేమేస్తే..

తిరుచానూరు : అదిరేటి డ్రస్సు మేమేస్తే...బెదిరేటి లుక్కు మీరిస్తే.. అన్నట్టుగా సాగింది.. మిస్టర్ అండ్ మిసెస్ తిరుపతి సాంప్రదాయ వస్త్రధారణ పోటీలు. ఈ పోటీలకు శిల్పారామం సాంస్కృతిక కళా మందిరం వేదికయ్యింది. తొలిసారిగా తిరుపతిలో నిర్వహించిన ఈ పోటీలకు యువతీ యువకుల నుంచి అపూర్వ స్పందన లభించింది.

తెలుగు సాంప్రదాయ కట్టుబొట్టుతో ఆడపడుచులు, పంచెకట్టుతో యువకులు ముసిముసి నవ్వులతో హొయలొలుకుతూ చేసిన ర్యాంప్ వాక్ సందర్శకులను ఉర్రూతలూగించింది. తిరుచానూరు రోడ్డులోని శిల్పారామంలో జరుగుతున్న ఆషాడం ఆనందలహరి సాంప్రదా య పోటీల్లో భాగంగా ఆదివారం సాయంత్రం సాంప్రదాయ వస్త్రధారణ పోటీలు నిర్వహించారు. ఈ పోటీలకు యువతులు 18 మంది, ఇద్దరు యువకులు మొత్తం 20 మంది పాల్గొన్నారు. ర్యాంప్ వాక్ చేస్తూ అందరినీ ఆకట్టుకున్నారు.

న్యాయనిర్ణేతలుగా శ్రీదేవి, రిజ్వాన్ ఫిరోజ్ వ్యవహరించారు. సోమవారం సాయంత్రం తెలుగు భాష విభాగంలో వ్యాసరచన పోటీలు నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో సుధ సంగీత కళాశాల చైర్మన్ సుధ, ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ లక్ష్మీనారాయణ, శిల్పారామం సిబ్బంది రాధాకృష్ణ, హరి, కృష్ణప్రసాద్, ఆనంద్, ప్రభాకర్, పవన్ తదితరులు పాల్గొన్నారు.
 

మరిన్ని వార్తలు