రేపటి నుంచి ఏపీ ఎంసెట్‌ దరఖాస్తుల స్వీకరణ

27 Feb, 2018 01:32 IST|Sakshi

సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు ఇంజనీరింగ్‌ కాలేజీల్లో 2018–19 విద్యా సంవత్సరపు ప్రవేశాల నోటిఫికేషన్‌ను ఏపీ ఎంసెట్‌ కన్వీనర్‌ ప్రొఫెసర్‌ సీహెచ్‌ సాయిబాబు సోమవారం విడుదల చేశారు. బీటెక్‌ ఇంజనీరింగ్, బయోటెక్నాలజీ, డెయిరేపటి నుంచి ఏపీ ఎంసెట్‌ దరఖాస్తుల స్వీకరణరీ టెక్నాలజీ, అగ్రికల్చరల్‌ ఇంజనీరింగ్, ఫుడ్‌ సైన్సు అండ్‌ టెక్నాలజీ, బీఎస్సీ అగ్రికల్చర్, బీఎస్సీ హార్టికల్చర్‌ బీఫార్మసీ, ఫార్మా డీ తదితర కోర్సుల్లో ప్రవేశానికి దరఖాస్తులు ఆహ్వానించారు.

ఏపీ ఆన్‌లైన్, టీఎస్‌ ఆన్‌లైన్, క్రెడిట్, డెబిట్, నెట్‌బ్యాంకింగ్‌ ద్వారా రూ. 500(ప్రాసెసింగ్‌ ఫీజుతో కలిపి) రుసుము చెల్లించి ఎంసెట్‌ ప్రవేశ పరీక్షకు ఆన్‌లైన్‌ విధానంలో ఈ నెల 28 నుంచి దరఖాస్తులు చేసుకోవచ్చు. ఇంజనీరింగ్, అగ్రికల్చర్‌ విభాగాలు రెండింటికీ హాజరుకాదల్చుకున్న వారు రూ. 1,000 చెల్లించాలి. అపరాధ రుసుము లేకుండా మార్చి 29వ తేదీతో గడువు ముగియనుంది. అపరాధ రుసుము రూ. 500తో ఏప్రిల్‌ 6 వరకు, రూ. 1,000తో ఏప్రిల్‌ 11 వరకు, రూ. 5 వేలతో ఏప్రిల్‌ 16 వరకు, రూ. 10వేలతో ఏప్రిల్‌ 21వరకు ఆన్‌లైన్‌ దరఖాస్తు చేసుకోవచ్చు. 

ఏప్రిల్‌ 22 నుంచి 26 వరకు పరీక్షలు
ఎంసెట్‌ ఇంజనీరింగ్‌ విభాగం ప్రవేశ పరీక్ష ఏప్రిల్‌ 22 నుంచి 25వ తేదీ వరకు జరుగుతుంది. అగ్రికల్చర్‌ విభాగం ప్రవేశ పరీక్ష ఏప్రిల్‌ 25, 26 తేదీల్లో జరగనుంది. విద్యార్థులు ఆన్‌లైన్‌ దరఖాస్తులో మూడు రీజనల్‌ సెంటర్లకు ప్రాధాన్య క్రమంలో ఆప్షన్‌ ఇవ్వాలి. ఏప్రిల్‌ 18 నుంచి హాల్‌ టికెట్లను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. 

మరిన్ని వార్తలు