కనిమొళి కేసుతో రేవంత్ కేసుకు పోలిక?

26 Jun, 2015 15:55 IST|Sakshi
కనిమొళి కేసుతో రేవంత్ కేసుకు పోలిక?

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఓటుకు కోట్లు కేసులో ప్రధాన పాత్రధారి రేవంత్ రెడ్డి బెయిల్ పిటిషన్ విచారణ సందర్భంగా హైకోర్టులో ఆసక్తికరమైన వాదనలు వినిపించాయి. ఇంతకుముందు దేశంలోనే అతిపెద్ద కుంభకోణంగా నిలిచిన 2జీ స్కాంలో ప్రధాన నిందితురాలైన డీఎంకే ఎంపీ కనిమొళి బెయిల్ పిటిషన్ విచారణ సందర్భంలో సుప్రీంకోర్టులో జరిగిన వాదనలను, సుప్రీం వ్యాఖ్యలను తెలంగాణ అడ్వకేట్ జనరల్ రామకృష్ణారెడ్డి ప్రస్తావించారు. కనిమొళి కేసు విచారణ సమయంలో సుప్రీంకోర్టు చెప్పిన విషయాలను పరిగణనలోకి తీసుకోవాలని ఆయన అన్నారు.

2జీ స్కాం వెలుగు చూసిన తర్వాత ఎంపీ కనిమొళి దాదాపు 190 రోజుల పాటు జైల్లోనే ఉన్నారు. ఈ మధ్య కాలంలో ఆమె ఐదుసార్లు బెయిల్ పిటిషన్లు దాఖలు చేశారు. అయితే సుప్రీంకోర్టు మాత్రం ఆమె చాలా శక్తిమంతమైన మహిళ అని, ఇలాంటి కీలకమైన కసులో ఆమెకు బెయిల్ ఇస్తే కేసును ప్రభావితం చేస్తారని వ్యాఖ్యానించి.. బెయిల్ మాత్రం మంజూరు చేయలేదు. ఈ విషయాన్ని అడ్వకేట్ జనరల్ రామకృష్ణారెడ్డి ప్రస్తావించి, అప్పుడు 2జీ కేసు ఎంత ప్రముఖమైనదో, ఇప్పుడు ఓటుకు కోట్లు కేసు కూడా అంత ప్రాముఖ్యం కలిగినదేనని చెప్పారు.

మరిన్ని వార్తలు