అగ్రిగోల్డ్‌ బాధితులను మోసగించిన చంద్రబాబు

16 Sep, 2019 08:13 IST|Sakshi

రూ.250 కోట్లు కేటాయించానని చెప్పి ఒక్క రూపాయి కూడా ఇవ్వకుండా మోసం

ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌ రూ.1,150 కోట్లు కేటాయింపు

పత్రికల్లో తప్పుడు కథనాలపై మండి పడుతున్న ఏబీపీఎస్‌

సాక్షి, ఒంగోలు సబర్బన్‌: ‘‘ఐదేళ్ల పాటు అధికారంలో ఉండి ఒక్క రూపాయి కూడా అగ్రిగోల్డ్‌ బాధితులకు ఇవ్వకుండా నిలువునా మోసం చేసింది మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.  ప్రజా సంకల్ప యాత్రలో అగ్రిగోల్డ్‌ బాధితుల గోడును ఆలకించిన వైఎస్‌.జగన్‌ మోహన్‌ రెడ్డి తాను అధికారంలోకి వచ్చి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తరువాత రూ.1,150 కోట్లు కేటాయించారు. అయితే చంద్రబాబు తన పచ్చ మీడియాతో ఇప్పుడు కూడా అసత్య ప్రచారాలు చేయించటం అత్యంత దారుణమని’’ ప్రకాశం జిల్లా అగ్రిగోల్డ్‌ బాధితుల సంఘం (ఏబీపీఎస్‌)నాయకులు అద్దంకి కోటేశ్వరరావు, కొల్లిపర ప్రసాద్‌ ధ్వజమెత్తారు. ఈ మేరకు ఇరువురు సంయుక్తంగా ఆదివారం ప్రకటన విడుదల చేశారు. పచ్చ పత్రికల్లో ఆదివారం ప్రచురితమైన కథనం సత్యదూరమన్నారు.

చంద్రబాబు అధికారంలో ఉన్న సమయంలో అగ్రిగోల్డ్‌ బాధితులకు ఒక్క రూపాయి కూడా ఇవ్వకపోగా కమిటీల పేరుతో కాలయాపన చేశారని విమర్శించారు. బాధితులను మభ్యపెట్టే ప్రకటనలు చేస్తూ ఎన్నికల సమయంలో రూ.250 కోట్లు కేటాయిస్తున్నానని చెప్పి నిలువునా మోసం చేశారన్నారు. అప్పట్లో జీఓ కూడా ఇచ్చి నిధులు కేటాయించలేదన్నారు. తన పచ్చ మీడియా ద్వారా బాధితులను ఆదుకుంటున్నట్టు ప్రకటనలు కూడా ఇచ్చారన్నారు. 2019 ఫిబ్రవరి 9న ఒక పత్రికలో మార్చి 27 లోపు చెల్లింపులు చేస్తామని ప్రకటించారని  గుర్తు చేశారు. బాధితులను మభ్యపెట్టే ప్రయత్నం చేశారన్నారు. ఎన్నికల్లో లబ్ధి పొందాలన్న ఆలోచనతో పసుపు–కుంకుమ పేరుతో నిధులను దారి మళ్లించారని, అగ్రిగోల్డ్‌ బాధితులకు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదన్నారు.

ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌మోహన్‌ రెడ్డి 3 నెలల్లో ఇస్తానని ఎప్పుడూ చెప్పలేదన్నారు. బాధితులకు ప్రస్తుతం జగన్‌ ప్రభుత్వం త్వరలో రూ.10 వేల లోపు ఉన్న వారికి అతి త్వరలో నేరుగా బ్యాంకులకు జమ చేస్తామని చెప్పారు. తరువాత రూ.20 వేల లోపు వారికి ఇస్తామంటున్నారు. ఖాళీ ఖజానా ఇచ్చి వెళ్లిన చంద్రబాబును వెనకేసుకొస్తున్న వారికి ఇంకా బుద్ధి రాలేదని విమర్శించారు.  

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా