వ్యవసాయ బడ్జెట్-2014 హైలెట్స్

22 Aug, 2014 10:46 IST|Sakshi
వ్యవసాయ బడ్జెట్-2014 హైలెట్స్

హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్‌ తొలి వ్యవసాయ బడ్జెట్‌ను వ్యవసాయ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు శుక్రవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టారు.14 వేల కోట్ల రూపాయలతో ఈ బడ్జెట్‌ రూపుదిద్దుకుంది. ఈ సందర్భంగా ప్రత్తిపాటి మాట్లాడుతూ 62శాతం మంది వ్యవసాయంపైనే ఆధారపడి ఉన్నారన్నారు.

*జాతీయ వ్యవసాయ విస్తరణ సాంకేతిక మిషన్‌కు రూ.62 కోట్లు
*జాతీయ ఆహారభద్రతా మిషన్‌లో...ముతకధాన్యాలు, వాణిజ్యపంటలు చేర్పు
*3.6లక్షల హెక్టార్లు లక్ష్యంగా రూ.153 కోట్లు కేటాయింపు
*జాతీయ నూనెగింజలు, ఆయిల్‌ఫాం మిషన్లకు రూ.59 కోట్లు
*రాష్ట్రీయ కృషి వికాస్‌యోజన పథకం ద్వారా అనుబంధ శాఖలకు కేంద్ర ప్రభుత్వం రూ.230 కోట్లు
*వర్షాధార ప్రాంతాల అభివృద్ధి కోసం రూ.169 కోట్లు
*ఎన్జీరంగా విశ్వవిద్యాలయంలో ఏపీలో ఏర్పాటుకు కేంద్రం ఆమోదం, రూ.50 కోట్లు కేటాయించింది
*దీనికి రాష్ట్ర ప్రభుత్వం రూ.192 కోట్లు కేటాయింపు
*వాటర్ మేనేజ్‌మెంట్, బిందుసేద్యానికి రూ.348 కోట్లు
* వైఎస్ఆర్ హార్టికల్చర్ వర్సిటీకి కేంద్రం నుంచి రూ.30 కోట్లు
*పట్టుపరిశ్రమకు రూ.122 కోట్లు
*పశుసంవర్ధక శాఖకు రూ.723 కోట్లు
*మత్స్యశాఖకు రూ.60 కోట్లు
*ఎస్వీ వెటర్నరీ యూనివర్సిటీకి రూ.112 కోట్లు
*సహకార శాఖకు రూ.156 కోట్లు
*రైతులకు 7 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్‌కు నిర్ణయం
*దీనిని 9 గంటలు పెంచేందుకు కృషిచేస్తాం
*ఉచిత విద్యుత్‌కు రూ.3188 కోట్లు

మరిన్ని వార్తలు