అగ్రిగోల్డ్‌ బాధితుల బాసట కమిటీ సమావేశం వాయిదా

17 Jan, 2018 19:20 IST|Sakshi

విజయవాడ: ఈనెల 18న జరగాల్సిన అగ్రిగోల్డ్ బాధితుల బాస‌ట క‌మిటీ స‌భ్యుల స‌మావేశం వాయిదా పడింది. అగ్రి గోల్డ్ కేసు అదేరోజున కోర్టులో విచార‌ణకు రానున్నందున సమావేశాన్ని 20వ తేదీ(శనివారం)కి వాయిదా వేసినట్లు వైఎస్సార్‌సీపీ జాతీయ కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు వి.విజయసాయిరెడ్డి తెలిపారు. కోర్టు ఉత్త‌ర్వుల‌ననుస‌రించి 20న జరిగే సమావేశంలో బాధితుల స‌మ‌స్య‌లపై కార్యాచరణ ఖరారు చేస్తామన్నారు. బాధితులు పూర్తి స‌మాచారంతో ఉదయం 10.30 గంటల‌కు విజయవాడలోని పార్టీ రాష్ట్ర కార్యాల‌యంలో హాజరు కావాలని ఆయన కోరారు. 

మరిన్ని వార్తలు