పేదల సంక్షేమమే లక్ష్యం

10 May, 2015 04:23 IST|Sakshi

ఇదో చరిత్రాత్మక దినం
పేద ప్రజలకు ఇలాంటి పథకాల వల్ల లక్ష్మీకటాక్షం
రాష్ట్ర ఉపముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి వెల్లడి


 అనంతపురం అర్బన్ : దేశ ప్రధాని నరేంద్రమోడీ తన అనుభవంతో పేద ప్రజలకు ఎన్నో ఉపయోగకరమైన పథకాలను ప్రవేశపెడుతూ.. పేద ప్రజల సంక్షేమమే ప్రధాన లక్ష్యంగా ముందుకెళ్తూ.. ప్రధానిని దేశ ప్రజలు ఎంతో అభిమానిస్తున్నారని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి పేర్కొన్నారు. శనివారం రాత్రి మెడికల్ కళాశాల  అడిటోరియంలో అర్బన్ ఎమ్మెల్యే వై.ప్రభాకర్‌చౌదరి అధ్యక్షతన ప్రత్యేక బీమా, పింఛన్ రక్షణ పథకాల ప్రారంభోత్సవానికి ఉప ముఖ్యమంత్రి ముఖ్యఅతిధిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఉపముఖ్యమంత్రి మాట్లాడుతూ... ఈ పథకాన్ని రాష్ట్రంలో 7 పట్టణాల్లో  ప్రారంభించగా  ఒక్క అనంత జిల్లాలోనే లక్ష మంది చేరారన్నారు. దేశ చరిత్రలోనే అసంఘటిత కార్మికుల కోసం భీమా ప్రవేశపెట్టిన ఘనత మన దేశ ప్రధానికే దక్కిందన్నారు. అదే స్ఫూర్తితో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా పనిచేస్తున్నారని.. అందులో భాగంగా రాయలసీమ ప్రాంత ప్రయోజనాల కోసం పట్టిసీమ ప్రాజెక్టును నిర్మాణం చేపట్టి రైతుల సంక్షేమానికి పెద్దపీట వేయాలని ముఖ్యమంత్రి ఆకాంక్ష అన్నారు.

అనంతరం ఐటీ శాఖ మంత్రి పల్లె రఘునాథ్‌రెడ్డి మాట్లాడుతూ... నిరుపేద, మధ్యతరగతి కుటుంబీకులకు ఈ భీమా పథకాలు ఎంతో ఉపయోగపడుతాయన్నారు. ప్రభుత్వ విప్ యామినీ బాల మాట్లాడుతూ ఏవరైతే.. పొదుపుబాట పడతారో.. వారే ధనవంతులని అందులో భాగంగా ఇలాంటి పథకాల వల్ల ఎంతో ఊరట లభిస్తోందన్నారు. ఎమ్మెల్సీ గేయానంద్ మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం ఇలాంటి పథకాలు అమలు చేయడం పేద ప్రజలకు ఎంతో ఉపయోగకరమని అయితే అధికారులు ఈ పథకాలను విసృ్తత స్థాయిలో ప్రచారం చేయాలని సూచించారు.  

సర్టిఫికెట్లు పంపిణీ చేసిన ఉపముఖ్యమంత్రి :
  కార్యక్రమం అనంతరం కేంద్ర ప్రభుత్వం అమలు చేసిన ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన (పీఎంఎస్‌బీవై), ప్రమాద బీమా, ప్రధానమంత్రి జీవనజ్యోతి బీమా యోజన (పీఎంజేజేబీవై) జీవిత బీమా వర్తింపు, అటల్ పెన్షన్ యోజన, పథకాలకు సంబంధించి సర్టిఫికెట్స్ ఆఫ్ ఇన్సూరెన్స్ సర్టిఫికెట్లను ఉప ముఖ్యమంత్రి అందజేశారు.

ఈ కార్యక్రమంలో ఏడీసీసీ ఛైర్మన్ లింగాల శివశంకర్‌రెడ్డి, ఎల్‌డీఎం జయశంకర్, ధర్మవరం నియోజకవర్గ ఎమ్మెల్యే గోనుగుంట్ల సూర్యనారాయణ, జిల్లా కలెక్టర్ కోన శశిధర్, జేసీ బి. ల క్ష్మీకాంతం, ఏజేసీ సయ్యద్ ఖాజామొహిద్దీన్, శిక్షణ కలెక్టర్ విజయకృష్ణన్, ఆర్డీఓ హుస్సేన్ సాహెబ్, నగర మేయర్ స్వరూప, డిప్యూటీ మేయర్ గంపన్న, అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు