కన్నీటి వీడ్కోలు

28 Jul, 2014 02:15 IST|Sakshi
కన్నీటి వీడ్కోలు

రణస్థలం: ఎయిర్‌ఫోర్స్ సైనికుడు దుంప లక్ష్మునాయు డి అంత్యక్రియలు అశ్రునయనాల మధ్య ఆదివారం జరిగాయి. కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీటి వీడ్కోలు పలికారు.  ఉత్తరప్రదేశ్ నుంచి లక్ష్మునాయుడి మృతదేహన్ని ప్రత్యేక విమానంలో విశాఖపట్నం తీసుకువచ్చి, అక్కడి నుంచి నేవీ వాహనంలో మృతదేహాన్ని సాయంత్రానికి  గోసాం తీసుకువచ్చారు. కుమారుడి మృతదేహాన్ని చూసి  తల్లిదండ్రులు, రమణయ్య, అసిరితల్లి, కుటుంబ సభ్యులు, గ్రామస్తులు మృతదేహాన్ని చూసి..భోరున విలపించారు. అనంతరం సైనికులు..లక్ష్మునాయుడి మృతదేహాన్ని శ్మశాన వాటికకు తీసుకువచ్చి, రెండు నిమిషాలు మౌనం పౌటించారు. గౌరవ వందనం సమర్పించారు.  గాల్లోకి మూడు రౌండ్ల కాల్పులు జరిపి, చితికి నిప్పంటించారు.
 
 పరిసర గ్రామాల ప్రజల రాక..
 లక్ష్మునాయుడి మృతదేహం గోసాంకి వస్తున్నట్టు ముం దుగానే తెలియడంతో..పరిసర గ్రామాల ప్రజలు, స్నేహితులు, బంధువులు మధ్యాహ్నం రెండు గంట లకు గోసాం చేరుకున్నారు. మృతదేహాన్ని చూసి కన్నీరుమున్నీరయ్యారు,.
 
 ప్రభుత్వ సాయం..
 లక్ష్మునాయుడి తల్లిదండ్రులకు ప్రభుత్వం నుంచి రావలసిన అన్ని బెనిఫిట్స్ అందిస్తామని ఎయిర్‌ఫోర్స్ అధికారి ఎజ్‌జీఎన్‌చౌహాన్ తెలిపారు. ఇన్సూరెన్స్ మొత్తా న్ని అందిస్తామన్నారు. అంత్యక్రియల్లో  ఎయిర్‌ఫోర్స్ సిబ్బందితో పాటు పోలీస్ శాఖ తరఫున హెచ్‌సీ అడివన్న, రెవెన్యూ కార్యదర్శి జె.వి.రమణమూర్తి పాల్గొన్నారు.
 
 పరామర్శలు..
 మృతుని కుటుంబాన్ని వైఎస్సార్‌సీపీ నాయకులు  గొర్లె నరసింహాప్పలనాయుడు, పిన్నింటి సాయికుమార్, మహంతి చినరామినాయుడు, సర్పంచ్ కంబపు రామిరెడ్డి, ఎంపీటీసీసభ్యుడు ముల్లు కృష్ణ, టీడీపీ నాయకులు గొర్లె హరిబాబునాయుడు, నడుకుదిటి ఈశ్వరరావు, వెలిచేటి సురేష్, మహంతి అసిరినాయుడు తదితరులు పరామర్శించారు.
 

మరిన్ని వార్తలు