రాష్ట్ర ప్రభుత్వ సీఎస్‌గా అజేయ కల్లం

28 Feb, 2017 06:50 IST|Sakshi
రాష్ట్ర ప్రభుత్వ సీఎస్‌గా అజేయ కల్లం

ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
నేడు బాధ్యతలు స్వీకరణ


సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి, ఆర్థిక, రెవెన్యూ శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజేయ కల్లం నియమితులయ్యారు. ప్రస్తుతం సీఎస్‌గా ఉన్న సత్య ప్రకాశ్‌ టక్కర్‌ మంగళవారం పదవీ విరమణ చేయనున్నారు. అనంతరం అజేయ కల్లాం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించనున్నారు. అయితే ఆయన మార్చి నెలాఖరునే పదవీ విరమణ చేయనున్నారు. అజేయ కల్లం రాష్ట్రంలో పలు కీలక శాఖల్లో పనిచేశారు. సమర్థ్ధవంతమైన అధికారిగా, నిబంధనలకు అనుగుణంగా వ్యవహరిస్తారని పేరుంది. 

అయితే తొలుత అజేయ కల్లంకు సీఎస్‌గా నియమించిన తర్వాత 3 నెలలు చొప్పున రెండు సార్లు పదవీ కాలాన్ని ప్రభుత్వం పొడిగిస్తుందని అందరూ భావించారు. కానీ ఆయనను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నియమించిన ప్రభుత్వం అదే జీవోలో ఏప్రిల్‌ 1వ తేదీ నుంచి సీఎస్‌గా దినేశ్‌ కుమార్‌ను నియమిస్తున్నట్టు పేర్కొంది. ప్రస్తుతం గ్రామీణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్న దినేశ్‌ కుమార్‌ 1983వ బ్యాచ్‌కు చెందిన వారు.

మరిన్ని వార్తలు