ఆంధ్రజ్యోతి రిపోర్టర్‌ ఇంట్లో మద్యం పట్టివేత

5 Jun, 2020 09:03 IST|Sakshi

సాక్షి, అనంతపురం : కళ్యాణదుర్గంలో ఎక్సైజ్‌ అధికారులు శుక్రవారం దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో ఆంధ్రజ్యోతి రిపోర్టర్‌ శంకర్‌ నాయక్‌ ఇంట్లో భారీగా మద్యం బయటపడింది. అతడి ఇంటి నుంచి 368 బాటిళ్ల కర్ణాటక మద్యాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఆంధ్రజ్యోతి విలేకరి శంకర్‌ నాయక్‌ ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. కాగా లాక్‌డౌన్‌ సమయంలోనూ అక్రమంగా మద్యం విక్రయించినట్లు శంకర్‌ నాయక్‌పై పలు ఆరోపణలు ఉన్నట్లు అధికారులు తెలిపారు. (ఆంధ్రజ్యోతి వాహనం సీజ్‌)

మరిన్ని వార్తలు