ఎత్తుకు పైఎత్తులు వేస్తూ..

20 Dec, 2014 01:27 IST|Sakshi
ఎత్తుకు పైఎత్తులు వేస్తూ..

బోట్‌క్లబ్(కాకినాడ) : లయన్స్ ఎలైట్ క్లబ్ ఆధ్వర్యంలో స్థానిక చల్లా ఫంక్షన్ హాలులో జరుగుతున్న ఆల్ ఇండియా ఓపెన్ ఫిడే రేటింగ్ చెస్ టోర్నమెంట్ మూడో రోజుపోటీలను శుక్రవారం ఎస్‌బీఐ రీజనల్ మేనేజర్ డీఎస్‌ఆర్‌కే సాయిబాబు ప్రారంభించారు. చెస్ ద్వారా తెలివితేటలు పెరుగుతాయని, క్రమశిక్షణ అలవడుతుందన్నారు. గుజరాత్ స్టేట్ పెట్రోలియం కార్పొరేషన్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ సీవీఎస్ రామన్ మాట్లాడుతూ క్రీడల అభివృద్ధికి తమ సంస్థ ఎల్లప్పుడు ముందుంటుందన్నారు. పోటీల్లో స్థానిక కేకేఆర్ గీతమ్ స్కూల్లో తొమ్మిదో తరగతి విద్యార్థి కేవీ సుభాష్ కొత్త రికార్డును నమోదు చేసుకుని ఆంధ్రాకు ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చారు.

పశ్చిమ బెంగాళ్‌కు చెందిన ఇన్‌కమ్‌టాక్స్ అధికారి రేటింగ్ ప్లేస్ ఉన్న క్రీడాకారుడు 2050 పాయింట్‌లో ఉన్న మజుందార్ శంకర్‌ను సుభాష్ ఓడించాడు. ఎన్నో అవార్డులు కేవలం 13 ఏళ్ల వయస్సులో సొంతం చేసుకోవడం గొప్ప విషయమని, ఆంధ్రా చెస్ అసోసియేషన్ అధ్యక్షుడు వైడీ రామారావు కొనియాడారు. క్లబ్ సభ్యులు  కెఆర్‌సీ రావు, చల్లా నిరంజన్‌రావు, శ్రీరామరాజు, సాయిరామ్, కామరాజు, లింగమల్లు, కృష్ణమూర్తి, చీఫ్ కుమార్‌తోపాటు పలువురు పాల్గొన్నారు.
 
మూడో రోజు స్కోర్ వివరాలు ఇలా...
రామకృష్ణ(తమిళనాడు) నాలుగు పాయింట్లు- అరవింద్‌బాబు.ఎల్(ఆంధ్రప్రదేశ్) మూడు పాయింట్లు సాధించారు. అర్జున్‌తివారి(రైల్వేస్) 3.5 - శ్రీవత్సవ ప్రత్యూష్ 3.5 పాయింట్లు సాధించగా డ్రాగా ముగిసింది. హేమచంద్రమౌళి(ఆంధ్రప్రదేశ్) 3- మల్లేశ్వరరావు నాలుగుపాయింట్లు సాధించారు. అనిల్‌కుమార్(కేరళ) 3.5, తుషాలి(ఆంధ్రప్రదేశ్) 3.5 పాయింట్లు సాధించగా, కె.శశిధర్‌కార్తీక్(ఆంధ్రప్రదేశ్) 3.5-సాయిఅగ్ని(తెలంగాణా) 3.5 పాయింట్లు సాధించగా డ్రాగా ముగిసింది.  ప్రతీక్‌శ్రీవాత్సవ్(తెలంగాణా) మూడు పాయింట్లు - డి.లక్ష్మణరావు(ఆంధ్రప్రదేశ్) నాలుగు పాయింట్లు సాధించారు.

తేజకీర్తి(ఆంధ్రప్రదేశ్) 3.5- ఎస్.ఆదిత్య(తమిళనాడు) 3.5 పాయింట్లు సాధించడంతో డ్రాగా ముగిసింది. బీఎన్‌బీ పవన్(ఆంధ్రప్రదేశ్) నాలుగు - సూర్యధనుష్(ఆంధ్రప్రదేశ్)మూడు పాయింట్లు సాధించారు. కె.వి.సుభాష్(ఆంధ్ర) నాలుగు - జె.నాగరాజు మూడు పాయింట్లు, అన్‌కన్‌రాయ్(వెస్ట్‌బెంగాళ్) 3.5- బోనురవికుమార్(3.5) పాయింట్లు సాధించగా డ్రాగా ముగిసింది. అర్జున్‌కల్యాణ్(తమిళనాడు) నాలుగు పాయింట్లు-జడికృష్ణ మూడు పాయింట్లు సాధించారు.

మరిన్ని వార్తలు