కలెక్టర్ తీరుకు నిరసనగా అఖిలపక్షం ధర్నా

6 Apr, 2015 11:30 IST|Sakshi

వైఎస్ఆర్ జిల్లా: వైఎస్ఆర్ జిల్లా అభివృద్ధిని కలెక్టర్ కేవీ రమణ అడ్డుకుంటున్నారని, ఆయన తీరుకు నిరసనగా కలెక్టరేట్ ఎదుట అఖిలపక్షం ధర్నా నిర్వహించింది. ప్రజల ఆకాంక్షలకి వ్యతిరేకంగా కలెక్టర్ పని చేస్తున్నారని ధర్నాలో పాల్గొన్న నేతలు అన్నారు.

 

ఈ ధర్నాలో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు, రఘురామ్ రెడ్డి, రవీంద్రనాధ్ రెడ్డి, అంజత్ భాష, సీపీఐ జిల్లా కార్యదర్శి ఈశ్వరయ్య, సీపీఎం జిల్లా కార్యదర్శి ఆంజనేయులు, మానవహక్కుల వేదిక జిల్లా కన్వీనర్ జయశ్రీలు పాల్గొన్నారు.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా