'వైద్య, ఆరోగ్య చరిత్రలో రేపు నూతనధ్యాయం'

30 Jun, 2020 14:20 IST|Sakshi

సాక్షి, విజయవాడ : ఆంధ్రప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి, దివంగత నేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి హయాంలో ప్రవేశపెట్టిన 108 అంబులెన్స్‌ సర్వీసులు తిరిగి రేపటి నుంచి అత్యాధునిక సౌకర్యాలతో అందుబాటులోకి వస్తున్నట్లు డిప్యూటీ సీఎం ఆళ్ల నాని పేర్కొన్నారు. రాష్ట్ర వైద్య, ఆరోగ్య చరిత్రలో రేపు నూతనధ్యాయానికి తెరతీస్తున్నామని ఆయన పేర్కొన్నారు.  గత టీడీపీ హయాంలో 108 వాహనాలు నిర్లక్ష్యంగా వ్యవహరించి పేదల ప్రాణాలను హరించాయన్నారు.(అత్యాధునిక 108, 104 సర్వీసులు రేపే ప్రారంభం)

ఆళ్ల నాని మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. 201 కోట్ల రూపాయలు నూతన 108, 104 వాహనాలు అందుబాటులోకి తీసుకువస్తున్నారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రేపు (బుధవారం) అత్యాధునిక సౌకర్యాలతో ఏర్పాటు చేసిన 108, 104 వాహనాలను విజయవాడ బెంజ్‌ సర్కిల్‌ వద్ద ప్రారంభించనున్నారని తెలిపారు. దీంతో 676 మండలాల్లో నూతన 108, 104 వాహనాలు అందుబాటులోకి  వస్తున్నాయని తెలిపారు. అర్బన్ పరిధిలో 15 నిమిషాలు, రూరల్ పరిధిలో 20నిమిషాలు,ఏజెన్సీ పరిధిలో 25 నిమిషాల్లో 108 వాహనం చేరుకునేలా టైం మేనేజ్‌మెంట్‌ వ్యవస్థను ఏర్పాటు చేశామన్నారు. మూడు రకాలైన 108 వాహనాలు అందుబాటులోకి తేవడంతో పాటు 104 అడ్వాన్స్ లైఫ్ సపోర్ట్ వాహనాలు,  282  బేసిక్ లైఫ్ సపోర్ట్   వాహనాలు, 26 నియోనాటల్ సపోర్ట్ వాహనాలు అందుబాటులోకి తీసుకువస్తున్నామని పేర్కొన్నారు. 

రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో పూర్తిగా సౌకర్యాలు పెంచే దిశగా అప్రమత్తంగా ఉన్నామన్నారు. ప్రజలకు సంభందించి అవగాహన సౌకర్యాలు పెంచాల్సిన అవసరం ఉందని సీఎం ప్రత్యేకంగా చెప్పారన్నారు.  ప్రతి క్వారంటైన్‌ కేంద్రాల్లో సౌకర్యాలు పెంచాలని, ప్రైవేట్‌ ఆసుపత్రుల్లో కరోనా ట్రీట్‌మెంట్‌పై ప్రత్యేక నిబంధనలు రూపొందించారన్నారు. లాక్‌డౌన్ సమయంలో ప్రజలు సహకరించారు కాబట్టే కేసులు తక్కువగా నమోదయ్యాయన్నారు. కేంద్రం రూపొందించిన కరోనా మార్గదర్శకాలుకు అనుగుణంగా ప్రజలు తమ భాగస్వామ్యం, సహకారం కావాలన్నారు. లాక్‌డౌన్ సడలింపు తర్వాత ఎక్కువగా కేసులు పెరగుతుండటం వల్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలిని ఆయన తెలిపారు. 

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా