ఎమ్మెల్సీలుగా ఏడుగురు ఏకగ్రీవ ఎన్నిక

10 Mar, 2017 15:47 IST|Sakshi
ఎమ్మెల్సీలుగా ఏడుగురు ఏకగ్రీవ ఎన్నిక

హైదరాబాద్‌ : ఆంధ్రప్రదేశ్‌ ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీలుగా ఏడుగురు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నుంచి ఆళ్ల నాని, గంగుల ప్రభాకర్‌ రెడ్డి, టీడీపీ నుంచి నారా లోకేశ్‌, కరణం బలరాం, డొక్కా మాణిక్య వరప్రసాద్‌, అర్జునుడు, పోతుల సునీత ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా అసెంబ్లీ కార్యదర్శి నుంచి ఆళ్ల నాని శుక్రవారం ఎమ్మెల్సీ ధ్రువీకరణ పత్రాన్ని అందుకున్నారు. తనకు ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చినందుకు వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డికి ఆయన ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా సమస్యలపై పోరాటం చేస్తానని ఆళ్ల నాని తెలిపారు.

మరోవైపు తెలంగాణ రాష్ట్రంలో కూడా ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రక్రియ పూర్తి అయింది. ఏకగ్రీవంగా ఎన్నికైన మైనంపల్లి హనుమంత రావు, ఎలిమినేటి క్రిష్ణారెడ్డి , గంగాధర్ గౌడ్ లకు ఎన్నిక ధ్రువీకరణ పత్రాలను రిటర్నింగ్ అధికారి ,అసెంబ్లీ కార్యదర్శి రాజా సదారామ్ అందజేశారు. కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్సీలకు హోంమంత్రి నాయిని నరసింహారెడ్డి, ప్రభుత్వ విప్‌ గొంగిడి సునీత, ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణరావు శుభాకాంక్షలు తెలిపారు.

మరిన్ని వార్తలు