చిత్తూరులో ఒక్క కేసు మాత్ర‌మే న‌మోదు: మ‌ంత్రి

30 Mar, 2020 18:46 IST|Sakshi

సాక్షి, తిరుప‌తి: చిత్తూరులో ఒక క‌రోనా కేసు మాత్ర‌మే న‌మోద‌యింద‌ని ఉప ముఖ్యమంత్రి, ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల కాళీక‌ష్ణ‌ శ్రీనివాస్(నాని) పేర్కొన్నారు. శ్రీకాళ‌హ‌స్తిలో క‌రోనా పాజిటివ్ కేసు న‌మోదు కావ‌డంతో ప‌రిస‌ర ప్రాంతాల్లో 65 మందికి క‌రోనా ప‌రీక్ష‌లు నిర్వ‌హించామ‌న్నారు. జిల్లా ప్ర‌జ‌లు ఆందోళ‌న చెందన‌వ‌స‌రం లేద‌ని స్ప‌ష్టం చేశారు. సోమ‌వారం ఆయ‌న తిరుప‌తిలో మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రానికి ఇతర‌ దేశాల నుంచి 29,672 మంది వ‌చ్చార‌ని, ఇందులో 29,494 మంది హోమ్ క్వారంటైన్‌లో ఉన్న‌ట్లు వెల్లడించారు. రాష్ట్రంలో 649 క‌రోనా అనుమానిత కేసులు న‌మోద‌య్యాయ‌ని తెలిపారు. వీళ్లంద‌రికీ ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌గా 526 మందికి నెగిటివ్ రిపోర్ట్ రాగా, 23 మందికి పాజిటివ్‌గా నిర్ధార‌ణ అయింద‌న్నారు. మ‌రో 100 టెస్టులు పెండింగ్‌లో ఉన్నాయ‌ని పేర్కొన్నారు.

"ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి క‌రోనా వ్యాప్తి నివార‌ణ‌కు ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వం ఇచ్చిన సలహాలు, సూచనలు పాటించండి. త‌ద్వారా మన కుటుంబం, గ్రామం, రాష్ట్రం, దేశం విజయం సాధిస్తుంది. ఏప్రిల్14 వరకు లాక్ డౌన్ పొడిగించినందున ఈ సమయంలో పేదప్రజలకు ఇబ్బందులు లేకుండా సీఎం జ‌గ‌న్ చర్యలు తీస్కున్నారు. పేదలకు రేషన్‌తోపాటు రూ.1000 పెన్షన్ అందించారు. ఎవ‌రైనా నిత్యావసర సరుకులు అధిక ధరలకు విక్రయిస్తే కఠిన చర్యలు తప్పదు" అని ఆళ్ల నాని హెచ్చ‌రించారు. (5 వేల పడకలతో కోవిడ్‌ ఆస్పత్రి)

మరిన్ని వార్తలు