మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే అరెస్ట్‌

13 Jan, 2020 09:53 IST|Sakshi

సాక్షి, గుంటూరు: రాష్ట్రంలో అధికార వికేంద్రీకరణ జరిగి, సమగ్ర అభివృద్ధి జరగాలని కోరుతూ మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి(ఆర్కే) ఆధ్వర్యంలో సోమవారం గుంటూరు జిల్లా పెనుమాక నుంచి తాడేపల్లి భారతమత విగ్రహం వారకు భారీ ర్యాలీ తలపెట్టారు. ర్యాలీలో పాల్గొనేందుకు భారీ సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు. అభివృద్ధి కావాలి.. వికేంద్రీకరణ జరగాలి అంటూ పెద్ద ఎత్తున ప్లకార్డులు ప్రదర్శించారు. అధికార వికేంద్రీకరణకు మద్దతుగా నినాదాలు చేశారు. అయితే నిషేధాజ్ఞలు ఉన్నందున ర్యాలీకు అనుమతి లేదని పోలీసులు అంటున్నారు. ర్యాలీ నేపథ్యంలో భారీగా పోలీసులను మొహరించారు. ఎమ్మెల్యే ఆర్కేను పోలీసులు అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు. ఆయనకు మద్దతుగా వచ్చిన మహిళలు, నాయకులను కూడా పోలీసులు అదుపులోకి  తీసుకున్నారు. ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డిని విడుదల చేయాలని కోరుతూ వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు, స్థానికులు పెద్ద ఎత్తున పోలీస్‌ స్టేషన్‌కు చేరుకుంటున్నారు.


కాగా, రాష్ట్రంలో పాలన, అభివృద్ధి వికేంద్రీకరణకు మద్దతుగా రాష్ట్రవ్యాప్తంగా ప్రదర్శనలు, ర్యాలీలు కొనసాగుతున్నాయి. ఒక్క రాజధాని వద్దు.. మూడు రాజధానులు ముద్దు నినాదాలతో ప్రదర్శనలు హోరెత్తున్నాయి. (చదవండి: వికేంద్రీకరణతో శరవేగంగా రాష్ట్రాభివృద్ధి)


 

(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

మరిన్ని వార్తలు