రాష్ట్రాలకు కేంద్ర హోంశాఖ లేఖ

12 May, 2020 10:16 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

రాష్ట్ర ప్రభుత్వాల సీఎస్‌లకు కేంద్ర హోంశాఖ లేఖ

వలస కూలీలు సొంతూళ్లకు వెళ్లేందుకు సహకరించాలంటూ మరో లేఖ

సాక్షి, అమరావతి: కోవిడ్‌–19 నియంత్రణ నేపథ్యంలో డాక్టర్లు, ఇతర వైద్య సిబ్బంది రాకపోకలను ఏ రాష్ట్రంలోనూ అడ్డుకోరాదని అన్ని రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులను కేంద్ర హోంశాఖ కోరింది. ఈ మేరకు ఆ శాఖ కార్యదర్శి అజయ్‌ భల్లా సోమవారం లేఖ రాశారు. వలస కూలీలు సొంతూళ్లకు వెళ్లేందుకు సహకరించాలని అన్ని రాష్ట్రాల సీఎస్‌లకు రాసిన మరో లేఖలో కోరారు. (తెలుగు రాష్ట్రాల మీదుగా వెళ్లే ప్రత్యేక రైళ్లు ఇవీ ..)

లేఖలో ఆయన ఇంకా ఏమన్నారంటే..
► కొన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో మెడికల్‌ ప్రొఫెషనల్స్, పారా మెడికల్‌ సిబ్బంది, ఇతర వైద్య సిబ్బంది రాకపోకలపై ఆంక్షలు విధించినట్టు మా దృష్టికొచ్చింది.
► కరోనా నివారణలో కీలక పాత్ర పోషిస్తూ ప్రజల ప్రాణాలు కాపాడుతున్న వీరు.. విధుల్లో భాగంగా రాకపోకలను సాగించాల్సి ఉన్నందున అడ్డంకులు సృష్టించొద్దు.
► ప్రయివేటు క్లినిక్‌లు, నర్సింగ్‌ హోమ్‌లకు అడ్డంకులు సృష్టించకుండా వాటిని కొనసాగించేలా చూడండి.
► పారిశుద్ధ్య సిబ్బంది రాకపోకలకూ ఆటంకాలు కలిగించకుండా చర్యలు తీసుకోవాలి.
► వలస కూలీలను సొంతూళ్లకు చేర్చేందుకు అవసరమైన ప్రత్యేక శ్రామిక రైళ్లను ఏర్పాటు చేసేందుకు కేంద్రం చర్యలు తీసుకుంటోంది. వారిని వారి ప్రాంతాలకు పంపేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా సహకరించాలి.
► వలస కూలీలు రోడ్డు మార్గంలో, రైలు పట్టాలపై నడుచుకుంటూ వెళ్లకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.
► రైళ్లు, బస్సులు ఏర్పాటయ్యే వరకు వారికి వసతి, భోజన సౌకర్యాలు కల్పించాలి.  

రీస్టార్ట్‌కి రెడీ అవుదాం: సీఎంలతో ప్రధాని మోదీ

మరిన్ని వార్తలు