జగన్‌తోనే రాజన్న రాజ్యం

3 Oct, 2013 04:40 IST|Sakshi
నెల్లిమర్ల రూరల్, న్యూస్‌లైన్: వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పాలనతోనే రాజన్నరాజ్యం సాధ్యమవుతుందని ఆ పార్టీ జిల్లా కన్వీనర్ పెనుమత్స సాంబశివరాజు అన్నారు. మం డల పరిధిలోని ఎ.టి అగ్రహారానికి చెందిన వంద కుటుం బాలు బుధవారం పార్టీలో చేరాయి. మండల కేంద్రంలో పార్టీ ఆధ్వర్యంలో జరుగుతున్న రిలే నిరాహార దీక్షా శిబిరం వద్దే వీరందరూ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భం గా పెనుమత్స మాట్లాడుతూ, దివంగత ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి హయాంలో స్వర్ణయుగం నడిచిందన్నారు. 
 
 ఆయన అకాల మరణం తర్వాత రాష్ట్రంలో దారుణ పరిస్థితులు నెలకొన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.  వైఎస్ కలలు కన్న రాజ్యం మళ్లీ జగన్‌తోనే సాధ్యమని స్పష్టం చేశారు. ఏ క్షణంలో ఎన్నికలు జరిగినా రాష్ట్రంలో వైఎస్సార్‌సీపీ విజయం సాధించడం ఖాయమన్నారు. పార్టీలో చేరిన వారిలో మీసాల తాతినాయుడు, మీసాల వెంకటరావు, లెంక శివకుమార్, మీసాల గోవిందరావు, పిన్నింటి రామారావు,  ఆబోతుల శ్రీరాముడు, కొర్నాన సత్యవమ్మ, టెక్కలి లక్ష్మి, కోండ్రు సురేష్, లెంక సూర్యారావు,  ఆబోతుల శ్రీరామ్మూర్తి, పిన్నింటి సూరప్పలనాయుడు తదితరులున్నారు. 
 
 జగన్ నాయకత్వాన్నే కోరుకుంటున్నారు..
 బొబ్బిలి టౌన్: వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి నాయకత్వాన్నే ప్రజలు కోరుకుంటున్నారని ఆ పార్టీ అరుకు పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకుడు ఆర్‌వీఎస్‌కేకే రంగారావు (బీబీ నాయన) అన్నారు. స్థానిక దర్బార్‌మహల్‌లో పార్వతీపురం నియోజకవర్గ సమన్వయకర్త జమ్మాన ప్రసన్నకుమార్ ఆధ్వర్యంలో పట్టణ ంలోని ఎనిమిదో వార్డుకు చెందిన 50 కుటంబాలు పార్టీలో చేరాయి. ఈ సందర్భంగా బేబీనాయన మాట్లాడుతూ, వైఎస్సార్‌సీపీ తప్ప అన్ని రాజకీయ పార్టీలూ ప్రజలతో ఆటలాడుకుంటున్నాయని తెలిపారు. రాష్ట్ర విభజన విషయంలో పూటకో మాట మారుస్తుండడం వల్ల కాంగ్రెస్, టీడీపీ నాయకులు ప్రజల్లో తిరగలేకపోతున్నారని చెప్పారు.
 
 రాష్ట్ర విభజనకు మద్దతు పలకడం వల్ల వైఎస్సార్‌సీపీ నాయకులకు ప్రజల్లో ఆదరణ పెరుగుతోందన్నారు. బొబ్బిలి రాజులను నమ్మి ఇతర పార్టీల నుంచి వైఎస్సార్‌సీపీలోకి వచ్చిన వారందరికీ న్యాయం జరుగుతుందని తెలిపారు. రానున్న ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ విజయం సాధించడం ఖాయమని జోష్యం చెప్పారు. పార్టీలో చేరిన వారిలో పొట్నూరు జయంతి, బంటు లక్ష్మణరావు, ముది లి రత్నాకర్, బోగి చిట్టెమ్మ, గంటు బాబురావు, పంట్ల రాధమ్మ, చింతాడ అప్పయ్యమ్మ, పలగర గంగమ్మ, బోనా ల శైలజ, శ్రీనివాసరావు, నింది కరుణ, అరసాడ మేరి, ముదిలి రామలక్ష్మి, చెన్న మహలక్ష్మి. ఎద్దు అప్పన్న తదితరులు ఉన్నారు.  కార్యక్రమంలో పార్వతీపురం మండల కన్వీనర్ చప్ప లకు్ష్మన్నాయుడు, నిడగల్లు మాజీ సర్పంచ్ జి.వెంకటనాయుడు, పారినాయుడు,తదితరులుపాల్గొన్నారు. 
 
>
మరిన్ని వార్తలు