టీడీపీ అభిప్రాయ సేకరణలో వాగ్వాదం

17 May, 2015 15:45 IST|Sakshi

విశాఖపట్నం: జిల్లా, నగర టీడీపీ అధ్యక్ష పదవుల ఎంపికపై అభిప్రాయ సేకరణ సందర్భంగా టీడీపీ నేతల మధ్య వాగ్వాదం జరిగింది. అభిప్రాయసేకరణ విషయమై గవిరెడ్డి రామానాయుడు, జడ్పీటీసీ పోతుల రమణమ్మ వాదనకు దిగారు. పార్టీ సస్పెండ్ చేసిన రమణమ్మ నుంచి అభిప్రాయం ఎలా సేకరిస్తారంటూ రామానాయుడు వర్గం వాదనకు దిగింది. అభిప్రాయ సేకరణ ముగిసిన తరువాత జిల్లా ఇన్చార్జి మంత్రి యనమల రామకృష్ణుడు మాట్లాడుతూ నగర అధ్యక్షుడిగా వాసుపల్లి గణేష్ కుమార్వైపే ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు మొగ్గు చూపుతున్నారని చెప్పారు. జిల్లా అధ్యక్షుడి ఎన్నికలో పోటీదారులతోపాటు ఆశావాహులు ఎక్కువగా ఉన్నట్లు చెప్పారు.

ఎంపికైన అభ్యర్థుల పేర్లను ఈ సాయంత్రం గానీ లేదా రేపు గానీ ప్రకటిస్తామన్నారు. విశాఖ జిల్లా టీడీపీలో వర్గాలు లేవని, అభిప్రాయబేధాలు మాత్రమే ఉన్నాయని తెలిపారు. జూన్ మొదటి వారంలో జిల్లా సమీక్షా సమావేశం జరుగుతుందని మంత్రి యనమల చెప్పారు.

మరిన్ని వార్తలు