‘రాజధాని పేరుతో అంతర్జాతీయ కుంభకోణం’

5 Dec, 2019 11:58 IST|Sakshi

సాక్షి, గుంటూరు: అమరావతిని అంతర్జాతీయ రాజధానిగా చేస్తామన్న టీడీపీ నేతలు.. అంతర్జాతీయ కుంభకోణంగా మార్చారని ఆ ప్రాంత రైతులు ఆరోపించారు. చంద్రబాబు ప్రభుత్వ కుంభకోణమే అసలు కోణం అనే పేరుతో వైఎస్సార్‌సీపీ నేతృత్వంలో గుంటూరులో గురువారం రౌండ్‌ టేబుల్‌ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో రాజకీయ పార్టీల నేతలు, ప్రజాసంఘాలు, రాజధాని ప్రాంత రైతులు పాల్గొన్నారు. రాజధాని పేరుతో గత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన అన్యాయంపై వారంత ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాజధాని పేరుతో టీడీపీ నేతలు అవినీతి సామాజ్యాన్ని ఏర్పాటు చేశారని రైతులు ఆరోపిస్తున్నారు.

చంద్రబాబు, ఆయన బినామీలు రాజధానిని ప్రకటించకముందే ఇన్‌సైడర్‌ పేరుతో భూములు కొనుగోలు చేశారని రైతులు చెబుతున్నారు. అలాగే భూములు తీసుకున్న రైతులకు ప్లాట్లు ఇచ్చినట్లు టీడీపీ ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే వీటిలో తమకు తీరని అన్యాయం జరిగిందని రైతులు వాపోతున్నారు. తమ ప్లాట్లు ఎక్కడున్నాయో తెలపాలంటూ ప్రశ్నిస్తున్నారు. అలాగే రాజధాని పేరుతో దళితులకు గత ప్రభుత్వం తీవ్ర అన్యాయం చేసిందని తీవ్రంగా విమర్శిస్తున్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, ఎమ్మెల్యేలు, సీపీఐ నాయకులు పాల్గొన్నారు.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

ఏపీ బాటలో కేరళ 

కోవిడ్‌ బలహీన పడింది

ఢిల్లీ వెళ్లొచ్చిందెవరు? 

కరోనా నియంత్రణ చర్యలు చాలా 'స్మార్ట్‌'!

ఏపీ సెట్లకూ కరోనా కష్టాలు

సినిమా

అర్జున్‌.. అను వచ్చేశారు

ప్రపంచంలో ఎన్నో కష్టాలున్నాయి

‘లాక్‌డౌన్‌ కష్టంగా ఉందా.. ఈ వీడియో చూడు’

‘మహానుభావుడు’ అప్పట్లోనే చెప్పాడు!!

క‌రోనా వ‌ల్ల ఓ మంచి జ‌రిగింది: న‌టుడు

అను, అర్జున్‌ల పరిచయం అదిరింది