పట్టెడన్నం పెట్టే రైతుల్ని బిచ్చగాళ్లు చేస్తారా?

14 Sep, 2017 01:13 IST|Sakshi
పట్టెడన్నం పెట్టే రైతుల్ని బిచ్చగాళ్లు చేస్తారా?
 ప్రపంచ బ్యాంకు బృందం ఎదుట రాజధాని రైతుల ఆవేదన
 
సాక్షి, అమరావతి బ్యూరో: అమరావతి నిర్మాణం పేరుతో రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న భూ అరాచకాలను రాజధాని ప్రాంత రైతులు ఎలుగెత్తి చాటారు. రైతుల ఫిర్యాదులపై పరిశీలన జరిపేందుకు నలుగురు ప్రతినిధుల తో కూడిన ప్రపంచబ్యాంకు తనిఖీ బృందం బుధవారం రాజధాని ప్రాంతంలో పర్యటిం చింది. తొలిరోజు నేలపాడు, పెనుమాక, ఉండవల్లి, ఎర్రబాలెం గ్రామాల్లో రైతులను కలుసుకుంది.  కొండవీటివాగు పనుల కోసం, గుంటూరులో మంచినీటి సరఫరా పనుల కోసం పురపాలక సంస్థకు గతంలో ప్రపంచబ్యాంక్‌ కేటాయించిన నిధులు ఏమ య్యాయని ప్రశ్నించారు.

వీటిపై సమగ్ర సమాచారం సేకరించాకే రాజధానికి రుణం మంజూరు పె ఓ నిర్ణయానికి రావాలని ఉండవల్లి, పెనుమాక, ఎర్రబాలెం రైతులు  తనిఖీ బృందానికి విన్నవించారు. ప్రపంచ బ్యాంకు బృంద కమిటీ చైర్మన్‌ గంజోలా క్యాస్ట్రో డీలా మార్టాతోపాటు సభ్యులు జాన్‌ మాట్స్‌న్, డీలేక్‌ బారాలాస్, బిగేట్‌ క్యూబా బృందంలో ఉన్నారు.  ‘రాజధానికి భూములు ఇవ్వడానికి మేం వ్యతిరేకం కాదు.  రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం కోసం వేలాది ఎకరాలు భూములు సేకరిస్తే ఒప్పుకోం. భూ సమీకర ణ కింద రైతులంతా భూములిచ్చారని చెబు తున్నారు. మరి అదే నిజమైతే సీఆర్‌డీఏకు కేవలం 150 ఎకరాలే ఎందుకు రిజిస్ట్రేషన్‌ చేశారో గమనించాలి’ అని ఉండ వల్లిలో ఓ మహిళ ప్రపంచ బ్యాంకు బృందా న్ని కోరిం ది. ‘రాజధానికి నాలుగైదు వేల ఎకరాలు చాలు.

కేవలం రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం కోసం 33 వేల ఎకరాలను సేకరిం చారు. ప్రపంచ బ్యాంకు రుణాన్ని కూడా స్వాహా చేసేందుకు యత్నిస్తున్నారు. పంట భూముల్లో రాజధాని ని నిర్మించడానికి కారణ మేంటో ప్రభుత్వం చెప్పాలి. ఫిర్యాదు చేసిన రైతులను ప్రభుత్వం వేధిస్తోంది. 3 పంటలు పండే భూములు ప్రభుత్వానికి ఇచ్చి.. గార్డెన్లలో,  అపార్ట్‌మెంట్ల లో పనిచేయ మని సీఆర్‌డీఏ అధికారులు చెబుతున్నారు. పట్టెడన్నం పెట్టే మమ్మల్ని బిచ్చగాళ్లుగా మారుస్తామంటే ఎట్టి పరిస్థితు ల్లోనూ భూము లివ్వం. క్షేత్రస్థాయిలో పరిశీలి స్తే సర్కారు అరా చకాలు వెలుగు చూస్తాయి. ఆ తర్వాతే రాజ ధాని నిర్మాణానికి రుణం ఇచ్చే విషయంలో ఓ నిర్ణయానికి రండి’ అని రాజధాని రైతులు విజ్ఞప్తి చేశారు. 
మరిన్ని వార్తలు