రాజధానికి భూములు ఇవ్వలేదని..

13 Sep, 2018 14:10 IST|Sakshi

సాక్షి, అమరావతి: రాజధాని నిర్మాణంలో భూములు ఇవ్వని రైతులపై టీడీపీ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు దిగుతోంది. ప్రభుత్వం ఆదేశాల మేరకు అధికారులు రైతులను ఎన్ని రకాలుగా ఇబ్బందులు గురి చేయాలో అన్నిరకాలుగా చేస్తున్నారు. తాజాగా పొలాలకు వెళ్లే వాటర్‌ పైపులను అధికారులు పగలగొట్టారు. దీనిపై వివరణ అడిగితే.. నిడమర్రు ఈ16 నిర్మాణం కోసమే వాటర్‌ పైపులు పగలగొట్టామని అధికారులు కాకమ్మకబుర్లు చెబుతున్నారు. కానీ రెండు రోజులుగా నీరు వృథాగా పోతున్నాయి.

కొద్ది రోజుల క్రితమే వాటర్‌పైపులు పగల కొట్టవద్దంటూ స్థానిక రైతులు వినతి పత్రం ఇచ్చారు. అయినప్పటికీ అధికారులు మొండి వైఖరితో వారు అనుకున్న పని చేశారని రైతులు మండిపడ్డారు. తమ పొలాలకు నీరు వచ్చే మార్గం అదొక్కటేనని, ఇప్పుడు అధికారులు ఇలా చేయడంతో పొలాలు ఎండిపోయే అవకాశం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారుల తీరును నిరసిస్తూ రైతులు ఆందోళనలు చేపట్టారు.  పగల కొట్టిన పైపులకు మరమ్మత్తులు చేసేవరకు  ఆందోళనలు కొనసాగిస్తామని రైతులు స్పష్టం చేశారు. 

 

 

మరిన్ని వార్తలు