అమరావతికి తొలి మెట్టు ‘ఎస్‌ఆర్‌ఎం’

16 Jul, 2017 02:50 IST|Sakshi
అమరావతికి తొలి మెట్టు ‘ఎస్‌ఆర్‌ఎం’
వర్సిటీ భవన ప్రారంభోత్సవంలో సీఎం చంద్రబాబు
 
నీరుకొండ (మంగళగిరి) : అమరావతి రాజధానికి ఎస్‌ఆర్‌ఎం యూనివర్సిటీ తొలి మెట్టు అని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. గుంటూరు జిల్లా మంగళగిరి మండలంలోని నీరుకొండ గ్రామంలో నిర్మించిన ఎస్‌ఆర్‌ఎం యూనివర్సిటీ భవనాన్ని శనివారం ముఖ్యమంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మూడు దశలలో రూ.3024 కోట్లతో నిర్మించనున్న ఎస్‌ఆర్‌ఎం యూనివర్సిటీని 50వేల మంది విద్యా ర్థులు చదువుకునేలా తీర్చిదిద్దేందుకు యాజ మాన్యం కృషిచేయడం అభినందనీయమన్నారు. 
 
అమరావతికి మరో 20వేల ఇళ్లు : వెంకయ్యనాయుడు
రాష్ట్రానికి ఇప్పటికే ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన కింద ప్రకటించిన లక్షా 93వేల ఇళ్లను కాకుండా అమరావతికి ప్రత్యేకంగా మరో 20 వేల ఇళ్లను మంజూరు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు అన్నా రు. అమరావతి నిర్మాణానికి కేంద్రం అండగా ఉం టుందని చెప్పారు. కార్యక్రమంలో శాసనసభ స్పీక ర్‌ కోడెల శివప్రసాదరావు, పలువురు రాష్ట్ర మంత్రు లు వర్సిటీ ఫౌండర్‌ చైర్మన్‌ టీఆర్‌ పచ్చముత్తు, ఎండి డాక్టర్‌ పి.సత్యనారాయణ, వీసీ జి.నారా యణ రావు తదితరులు పాల్గొన్నారు.
 
మంత్రి అయ్యన్నపాత్రుడి అలక
ఇదిలాఉండగా, కార్యక్రమంలో పాల్గొనేం దుకు వచ్చిన జిల్లా ఇన్‌చార్జి మంత్రి చింతకాయల అయ్యన్న పాత్రుడుకు చేదు అనుభవం ఎదురైంది. కొద్దిపాటి ఆల స్యంగా వచ్చిన ఆయన లోపలికి వెళ్లబోగా సీఎం స్పెషల్‌ సెక్యూరిటీ సిబ్బంది నిలిపి వేశారు. తాను జిల్లా ఇన్‌చార్జి మంత్రినని చెప్పినా వినకుండా ఎస్పీ చెబితేనే పంపుతామని వారు బదులిచ్చారు. దీంతో మంత్రి అలిగి వెనక్కి వెళ్లిపోయారు.
 
డిసెంబర్‌లో రెండు అంతర్జాతీయ సదస్సులు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో వచ్చే డిసెంబర్‌లో నిర్వహించే టెక్‌–2017 సదస్సు, ఇండియన్‌ ఎకనమిక్‌ అసోసియేషన్‌ (ఐఈఏ) శతాబ్ది ఉత్సవాలకు విస్తృత ఏర్పాట్లు చేయాలని సీఎం చంద్రబాబు  అధికారులను ఆదేశించారు. 
మరిన్ని వార్తలు