'చంద్రబాబు మాటలు విని మోసపోవద్దు'

20 Jan, 2015 13:01 IST|Sakshi

హైదరాబాద్ : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై వైఎస్ఆర్ సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కుటుంబ నియంత్రణపై చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు చూస్తుంటే ఆయనకు మతిభ్రమించినట్లు ఉందేమో అనే అనుమానం కలుగుతుందని ఆయన ఎద్దేవా చేశారు. సీఎం పదవిలో ఉన్న వ్యక్తి అలా మాట్లాడం సమంజసం కాదన్నారు. ఎక్కువమంది పిల్లల్ని కనాలని చంద్రబాబు వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే.

చంద్రబాబు చేస్తున్న ప్రకటనలు...  రాష్ట్రాన్ని అధోగతిపాలు చేసేలా ఉన్నాయని అంబటి రాంబాబు విమర్శించారు.  యువ దంపతులు బాబు మాటలు విని మోసపోవద్దని ఆయన సూచించారు. నాగార్జున యూనివర్సిటీలో అడుగుపడితే  పదవి పోతుందన్న  చంద్రబాబు నమ్మకం మూఢ విశ్వాసాలను పెంపొందించేలా ఉందని అంబటి విమర్శించారు. వెంకటేశ్వర స్వామితో ఎన్టీఆర్ను పోల్చడం సరైంది కాదని ఆయన అన్నారు.

ల్యాండ్ పూలింగ్పై ప్రజలకు వైఎస్ఆర్ సీపీ అండగా ఉంటుందని అంబటి రాంబాబు స్పష్టం చేశారు. గతంలో సీఎం ఉన్న సమయంలో చేసిన భూకేటాయింపులపై సభా సంఘం వేయాలని ఆయన డిమాండ్ చేశారు. అప్పుడే చంద్రబాబు చిత్తశుద్ధి బయపడుతుందని అంబటి అన్నారు.

మరిన్ని వార్తలు