దళితులను అవమాన పరుస్తారా?

15 Apr, 2016 03:29 IST|Sakshi
దళితులను అవమాన పరుస్తారా?

అంబేడ్కర్ జయంతి సభలో అర్ధాంతరంగా వెళ్లిపోయిన ప్రజాప్రతినిధులు
దళిత సంఘాల నాయకుల మండిపాటు

 
అనంతపురం సెంట్రల్ :  అంబేడ్కర్ వర్ధంతి సభ నుంచి ప్రజా ప్రతినిధులు అర్ధాంతరంగా వెళ్లి పోవడంపై దళిత సంఘాల నేతలు మండిపడ్డారు.  గురువారం అంబేద్కర్ వర్దంతి సభ జిల్లా పరిషత్ హాలులో నిర్వహించారు. పలువురు దళిత సంఘాల నాయకులు వారి అభిప్రాయాలు, సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువస్తున్నారు. ఉన్న ఫలంగా ఒకేసారి జెడ్పీ చైర్మన్ చమన్, ఎమ్మెల్యే ప్రభాకర్‌చౌదరి, మేయర్ స్వరూప, డిప్యూటీ మేయర్ గంపన్న సభ నుంచి వెళ్లిపోయారు. దీంతో దళిత సంఘాల నాయకులు తీవ్రంగా మండిపడ్డారు.

కాంగ్రెస్‌పార్టీ ఎస్సీ సెల్ రాష్ట్ర నాయకులు శంకర్, జిల్లా అధ్యక్షుడు ఓబిలేసు తదితరులు ఆందోళనకు దిగారు. దళితులు అంటే అంత చులకనా? అంబేడ్కర్‌ను అవమాన పర్చేలా ప్రజాప్రతినిధులు వెళ్లిపోవడం ఏంటని ఇన్‌చార్జ్ కలెక్టర్ సయ్యద్‌ఖాజామొహిద్దీన్‌తో వాగ్వాదానికి దిగారు. ముందస్తు షెడ్యూల్ మేరకు వారు ఇందిరమ్మ గృహాల శంకుస్థాపన అనంతరం తిరిగి సమావేశంలో పాల్గొంటారని ఆయన వివరించారు. అప్పటికీ దళిత సంఘాల నాయకులు ఆందోళన విరమించకపోవడంతో పోలీసుల సహకారంతో సభనుంచి బయటకు పంపించారు.

మరిన్ని వార్తలు