అంబేడ్కర్ జయంతి జరిపే హక్కు బాబుకు లేదు

12 Apr, 2016 01:46 IST|Sakshi
అంబేడ్కర్ జయంతి జరిపే హక్కు బాబుకు లేదు

►  వైఎస్సార్‌సీసీ రాష్ట్ర నేతలు లేళ్ల అప్పిరెడ్డి, మేరుగ నాగార్జున
 
తెనాలి : ఎస్సీల సంక్షేమాన్ని నీరుగారుస్తూ, ఎస్టీ, ఎస్టీ చట్టాలను అపహాస్యం చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు బీఆర్ అంబేడ్కర్ జయంతి జరిపే అర్హత కోల్పోయారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి, పార్టీ ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ మేరుగ నాగార్జున విమర్శించారు. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి వైఎస్ రాజశేఖరరెడ్డి కృషి చేశారన్నారు. అదే మార్గంలో వైఎస్  జగన్‌మోహన్‌రెడ్డి నాయకత్వంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అంబేడ్కర్ ఆలోచనా విధానంతో ముందుకు సాగుతోందని స్పష్టం చేశారు. సోమవారం సాయంత్రం తెనాలిలో పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త అన్నాబత్తుని శివకుమార్‌తో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు.    

డాక్టర్ నాగార్జున మాట్లాడుతూ.. ఎస్సీల్లో పుట్టాలని ఎవరు కోరుకుంటారని వ్యాఖ్యానించిన చంద్రబాబు, ఎస్సీ ఎస్టీ చట్టాలను అపహాస్యం చేస్తున్నారని ఆరోపించారు. లేళ్ల అప్పిరెడ్డి మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బీఆర్ అంబేడ్కర్  రాసిన రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా పరిపాలన సాగిస్తున్నాయన్నారు. అంబేడ్కర్ జయంతి ఉత్సవాలను రాష్ట్రవ్యాప్తంగా నిర్విహ స్తున్నామని అన్నారు. నాయకులు  రాపర్ల నరేంద్ర, గాదె శివరామకృష్ణారెడ్డి, పెరికల కాంతారావు, సుద్దపల్లి నాగరాజు, బూరెల దుర్గా, విష్ణుమొలకల రెడ్డియ్య, ఉయ్యూరు అప్పిరెడ్డి, కరాఠపు రాజమోహన్, అక్కిదాసు కిరణ్‌కుమార్, సయ్యద్ గ్యాస్‌సుభాని పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు