'కలాం పేరు మీద అవార్డులు ఇవ్వడం గొప్ప విషయం'

31 Oct, 2019 11:31 IST|Sakshi

సాక్షి, విజయవాడ : విజయవాడలోని గ్లోబల్‌ క్రియేటివ్‌ ఆర్ట్స్‌ అకాడమీ ఆఫ్‌ ఫిలాన్తరోపిక్‌ సొసైటీ ఆధ్వర్యంలో అబ్దుల్‌ కలామ్‌ అవార్డ్స్‌ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఉప ముఖ్యమంత్రి అంజాద్‌ బాషా, మహిళా కమిషన్‌ చైర్ పర్సన్‌ వాసిరెడ్డి పద్మ హాజరయ్యారు. ఈ సందర్భంగా అంజాద్‌ బాషా మాట్లాడుతూ.. అబ్దుల్‌ కలాం దేశానికి చేసిన సేవలు మరువలేనివి. అటువంటి వ్యక్తి పేరు మీద అవార్డులు అందించడం గొప్ప విషయమని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో అవార్డు అందుకొన్న ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలిపారు. సమాజ మార్పు కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలి. బడుగు బలహీన వర్గాలకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పెద్ద పీట వేశారు. మహిళలకు నామినేటెడ్‌ పదవుల్లో 50 శాతం రిజర్వేన్లు కల్పించిన ఘనత మా ప్రభుత్వానిదేనని మంత్రి వెల్లడించారు. రాజ్యాంగ పదవిలో ఉన్నా సామాన్య జీవితం గడిపిన అబ్దుల్‌ కలాం లాంటి  వ్యక్తిని మనందరం ఆదర్శంగా తీసుకోవాలని వాసిరెడ్డి పద్మ పిలుపునిచ్చారు. కలాం ఆశయాలను జగన్‌ ప్రభుత్వం నెరవేరుస్తుందని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. సామాజికి న్యాయానికి ముఖ్యమంత్రి జగన్‌ కట్టుబడే ఉన్నారని పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు