‘మైనారిటీ సంక్షేమ దినోత్సవంగా నిర్వహిస్తాం’

9 Nov, 2019 19:11 IST|Sakshi

సాక్షి, విజయవాడ: జనాబ్‌అబుల్‌ కలాం ఆజాద్‌ 132వ జయంతి ఏర్పాట్లను శనివారం డిప్యూటీ సీఎం అంజాద్‌ బాషా పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. జనాబ్‌అబుల్‌ కలాం ఆజాద్‌ జయంతిరోజు విద్యాదినోత్సవాన్ని, మైనారిటీ సంక్షేమ దినోత్సవంగా నిర్వహించాలని ప్రభుత్వం సంకల్పించిందని తెలిపారు. డాక్టర్ అబ్దుల్ కలాం లైఫ్ టైం అచీవ్‌మెంట్ పురస్కారానికి జాబితా సిద్ధమైనట్టు వెల్లడించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి హాజరు కానున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమ ఏర్పాట్లపై జేసీ మాధవీలతకు అంజాద్‌ బాషా పలు సూచనలు ఇచ్చారు.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా