ఆందోళన చేస్తే అరెస్టు చేస్తారా!

26 Feb, 2014 23:44 IST|Sakshi

 ఆందోళన చేస్తే అరెస్టు చేస్తారా!
 
 ఆత్మకూరుటౌన్,
 న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని ఆందోళన చేస్తే అరెస్టులు చేస్తారా అని అంగన్‌వాడీ వర్కర్స్ యూనియన్ వెంకటలక్ష్మి ప్రశ్నించారు. బుధవారం పట్టణంలోని కర్నూలు-గుంటూరు ప్రధాన రహదారిలోని గౌడ్ సెంటర్‌లో ప్రభుత్వ దిష్టిబొమ్మను అంగన్‌వాడీలు దహనం చేసి రాస్తారోకో నిర్వహించారు.

 

  సుదర్శన్ భవనం నుంచి ప్రభుత్వ దిష్టిబొమ్మకు శవయాత్ర ప్రధాన రహదారి, పురవీధులవెంట నిర్వహించారు. అంగన్‌వాడీల నినాదాలతో ఆత్మకూరు పట్టణం అట్టుడికింది. దాదాపు రెండు గంటల సేపు కర్నూలు-గుంటూరు ప్రధాన రహదారిపై భారీ సంఖ్యలో వాహనాలు నిలిచిపోయాయి. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎన్నో ఏళ్ల నుంచి పెండింగ్‌లో ఉన్న సమస్యలను పరిష్కరించాలని ఎన్నో సార్లు ధర్నాలు చేసినా  ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన  రాలేదన్నారు.

 

అంగన్‌వాడీ మహిళలపై లాఠీ చార్జ్‌లు చేయడం సిగ్గుచేటన్నారు.  ఈ కార్యక్రమంలో సీపీఎం నాయకులు రణధీర్, అంగన్‌వాడీ వర్కర్స్ యూనియన్ నాయకురాళ్లు జయలక్ష్మి, చంద్రకళ, మంజుల, లలితమ్మ, ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు రాజేష్   పాల్గొన్నారు.
 

 వెలుగోడులో..

 

 వెలుగోడు, : తమ డిమాండ్లను పరిష్కరించాలని బుధవారం పొట్టి శ్రీరాములు సెంటర్‌లో  రాస్తారోకో  అంగన్‌వాడీ ఉద్యోగులు నిర్వహించారు.  పట్టణ పురవీధుల వెంట రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు.

ఈసందర్భంగా అంగన్‌వాడీ ఉద్యోగులు రమాదేవి, శ్యామల మాట్లాడుతూ అంగన్‌వాడీ ఉద్యోగులకు కనీస వేతనం రూ.12,500లు చెల్లించాలని, ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని డిమాండ్ చేశారు.  
 
 

మరిన్ని వార్తలు