ప్రజా సంక్షేమమే జగన్‌ లక్ష్యం

29 Mar, 2019 15:00 IST|Sakshi
అభిమానులకు అభివాదం చేస్తున్న ఆనం రామనారాయణరెడ్డి

ఆనం రామనారాయణరెడ్డి

సాక్షి, సైదాపురం: వైఎస్సార్‌ ప్రజల కోసం ఒక అడుగు ముందుకు వేశారు, ఆయన ఆశయ సాధనలో భాగంగా ప్రజా సంక్షేమమే లక్ష్యంగా మరో రెండు అడుగులు ముందుకు వేస్తున్న వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రజా సంక్షేమానికి పెద్ద పీట వేస్తారని వైఎస్సార్‌సీపీ వెంకటగిరి అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థి ఆనం రామనారాయణరెడ్డి తెలిపారు. మండలంలోని జోగిపల్లి, పొక్కందల, ఆదూరుపల్లి, ఊటుకూరు, తురిమెర్ల, పరసారెడ్డిపల్లి, గోవిందపల్లి, ఇస్కపల్లి, గిద్దలూరు, రాగనరామాపురం, తిప్పిరెడ్డిపల్లి గ్రామాల్లో గురువారం వైస్సార్‌సీపీ ట్రేడ్‌ యూనియన్‌ జిల్లా కార్యదర్శి నోటి రమణారెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు కె.కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో ప్రజాదీవెన కార్యక్రమాలను నిర్వహించారు.

ఆనం మాట్లాడుతూ వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని ముఖ్యమంత్రి చేయడానికి ప్రతి ఒక్కరూ ఓట్లు వేసి ఆశీర్వదించాలని ఓటర్లను అభ్యర్థించారు. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రవేశ పెట్టిన నవరత్నాల పథకాలతో ప్రతి పేద కుటుంబానికి లబ్ధిచేకూరుతుందన్నారు. అవ్వా, తాతలకు, దివ్యాంగులకు పింఛన్‌ పెంచుతామన్నారు. రాజన్న రాజ్యం తిరిగి చూడాలంటే  మనమందరం కష్టపడి జగనన్నను సీఎం చేద్దామని, అలాగే వెంకటగిరి నియోజకవర్గంలో తనను గెలిపించాలని కోరారు. వడ్డీలు చెల్లించలేక అప్పుల్లో కూరుకుపోయిన డ్వాక్రా మహిళలకు రుణాలను మాఫీ చేసి ఆదుకుంటామన్నారు.

డ్వాక్రా రుణాలను మాఫీ చేస్తామని చంద్రబాబు నాలుగున్నర  రాజశేఖరరెడ్డి పాలన చూడాలంటే వైఎస్‌జగన్‌మోహన్‌రెడ్డిని ముఖ్యమంత్రిగా చేసుకోవాలన్నారు. రాజన్న రాజ్యం కావాలంటే ప్రతి ఒక్కరు వైఎస్సార్‌సీపీకి చెందిన ఫ్యాన్‌ గుర్తుకు ఓటేసి జగన్‌మోహన్‌రెడ్డిని ముఖ్యమంత్రి చేసుకుందామని ఆయన  పిలుపు నిచ్చారు. కార్యక్రమంలో వైఎస్‌ చైర్‌పర్సన్‌ పోట్టేళ్ల శిరీషా, జిల్లా పార్టీ కార్యదర్శి దాసరిరాజు శంకరరాజు, మాజీ ఎంపీపీ మన్నారపు రవికుమార్, సైదాపురం మాజీ సర్పంచ్‌ బండి వెంకటేశ్వర్లురెడ్డి, ప్రచార కార్యదర్శి మహేంద్రరెడ్డి, నియోజకవర్గ బూత్‌ కమిటి కో–ఆర్డినేటర్‌ చెముర్తి జనార్దన్‌రాజు, నాయకులు  టీవీఎల్‌నారాయణరావు, రాంగోపాల్‌రెడ్డి, వెంకటేశ్వర్లురెడ్డి, కరణం శ్రీనివాసులునాయుడు, గజ్జెల రాఘవరెడ్డి, మాజీ సర్పంచ్‌ కామేశ్వరి, మాలకొండారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు