అనంతబాబుపై కేసులో హైకోర్టు స్టే

17 Sep, 2014 01:50 IST|Sakshi

 రంపచోడవరం :  జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం అధ్యక్షుడు  అనంత ఉదయభాస్కర్ (అనంతబాబు)పై అరకు ఎంపీ కొత్తపల్లి గీత దాఖలు చేసిన ఎస్సీ, ఎస్టీ ఎట్రాసిటీ కేసుపై  తదుపరి చర్యలను నిలుపుదల చేస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఎంపీ కొత్తపల్లి గీత టీడీపీ వైపు వెళ్లడంపై అనంత ఉదభాస్కర్ పత్రికల్లో ప్రశ్నించిన నేపథ్యంలో ఆమె ఆయనపై విశాఖపట్నం 4వ పట్టణ పోలీసు స్టేషన్‌లో ఎస్సీ,ఎస్టీ ఎట్రాసిటి కేసు పెట్టిన సంగతి తెలిసిందే. దాంతో ఆయనను పోలీసులు అరెస్టు చేశారు. పోలీసులు నమోదు చేసిన కేసు అక్రమమని, దాన్ని రద్దు చేయాలని కోరుతూ అనంత ఉదయభాస్కర్ హైకోర్టును ఆశ్రయించారు. కేసును విచారణకు స్వీకరించిన హైకోర్టు తదుపరి చర్యలను నిలుపుదల చేస్తూ  మంగళవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఆ విషయాన్ని అనంతబాబు ఒక ప్రకటనలో తెలిపారు.
 
 న్యాయమే గెలిచింది: అనంత బాబు
 స్వార్థ ప్రయోజనాలు కోసం తనపై అక్రమంగా, అన్యాయంగా అధికార పార్టీ అండదండలతో అరకు ఎంపీ కొత్తపల్లి గీత ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టినప్పటికీ న్యాయమే గెలిచిందని  అనంతబాబు ఆప్రకటనలో పేర్కొన్నారు.  
 

మరిన్ని వార్తలు