అనంతపురం, హిందూపురం..రంగయ్య, నదీమ్‌

2 May, 2018 12:59 IST|Sakshi
రంగయ్య, నదీమ్‌

సాక్షి ప్రతినిధి, అనంతపురం : అనంతపురం, హిందూపురం పార్లమెంట్‌లకు వేర్వేరుగా సమన్వయకర్తలను నియమిస్తూ వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు మంగళవారం ఆయన పేరుతో పార్టీ కేంద్ర కార్యాలయం ప్రకటన జారీ చేసింది. అనంతపురం, హిందూపురం పార్లమెంట్‌ల సమన్వయకర్తగా ఇప్పటి వరకూ కొనసాగిన తలారి పీడీ రంగయ్యను అనంతపురం పార్లమెంట్‌మన్వయకర్తగా నియమించారు. అలాగే అనంతపురం అర్బన్‌ సమన్వయకర్తగా ఉన్న నదీమ్‌ అహ్మద్‌ను హిందూపురం పార్లమెంట్‌ సమన్వయకర్తగా నియమించారు. అనంతపురం పార్లమెంట్‌ అధ్యక్షుడు అనంత వెంకట్రా మిరెడ్డిని అనంతపురం అర్బన్‌ నియోజకవర్గ సమన్వయకర్తగా కూడా నియమించారు.

సముచిత నిర్ణయమే

హిందూపురం పార్లమెంట్‌ సమన్వయకర్తగా నదీమ్‌ అహ్మద్‌ను ఎంపిక చేయడం మంచి నిర్ణయమే. వైఎస్సార్‌ కుటుంబానికి ముందు నుంచి మైనార్టీలు అంటే చాలా ప్రేమ. 2004 ఎన్నికల్లో సైతం హిందూపురం పార్లమెంట్‌ స్థానానికి కదిరికి చెందిన కర్నల్‌ నిజాముద్దీన్‌కి టికెట్‌ ఇచ్చి గెలిపించుకున్నారు. అలాగే 2009 ఎన్నికల్లో సైతం మళ్లీ మైనార్టీ అభ్యర్థి అయిన ఖాసీమ్‌ఖాన్‌కు టికెట్‌ ఇచ్చారు. అయితే ప్రజారాజ్యం పార్టీ తరపున కడపల శ్రీకాంత్‌రెడ్డి బరిలో ఉండడం వల్ల ఖాసీం ఖాన్‌ ఓటమి పాలయ్యేవాడు. లేకపోతే అప్పుడు కూడా మైనార్టీ అభ్యర్థే గెలుపొందేవారు. ఇప్పుడు మా అధినేత జగన్‌మోహన్‌రెడ్డి హిందూపురం పార్లమెంట్‌ సమన్వయకర్తగా నదీమ్‌ను ఎంపిక చేయడం మంచి నిర్ణయం. మైనార్టీలకు సముచిత స్థానం కల్పించారు.

నదీమ్‌ నియామకం మైనార్టీలకు ఇచ్చిన గౌరవం 

జిల్లాలో 14 అసెంబ్లీ స్థానాలు ఉంటే గత ఎన్నికల్లో ఒక్క అసెంబ్లీ స్థానంలో కూడా టీడీపీ మైనార్టీ అభ్యర్థిని నిలపలేదు. ఏపీ కేబినెట్‌లో కూడా మైనార్టీకి అవకాశం లేదు. మేము కదిరి అసెంబ్లీకు మైనార్టీ అభ్యర్థిగా చాంద్‌బాషాకు అవకాశం ఇచ్చాం. అతను పార్టీని మోసం చేసి వెళ్లిపోయాడు. ఇప్పుడు కూడా వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ హిందూపురం పార్లమెంట్‌ సమన్వయకర్తగా నదీమ్‌ను నియమించింది. ఈ నియామకం మైనార్టీలకు ఇచ్చిన గౌరవం. నదీమ్‌ మంచి వ్యక్తి, సౌమ్యుడు ఖచ్చితంగా అతనికి తామంతా సంపూర్ణంగా మద్దతు ప్రకటిస్తున్నాం. అతని నియామకాన్ని మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాం. నదీమ్‌కు పూర్తిస్థాయిలో సహకరిస్తాం. వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం చాలా మంచిది.

మరిన్ని వార్తలు