కరోనా పరీక్షలు చేయించుకోలేదు: కలెక్టర్‌

15 Apr, 2020 16:44 IST|Sakshi

సాక్షి, అనంతపురం: తాను ఎలాంటి పరీక్షలు చేయించుకోలేదని అనంతపురం జిల్లా కలెక్టర్‌ గంధం చంద్రుడు స్పష్టం చేశారు. జిల్లా కలెక్టర్‌ కరోనా పరీక్షలు చేయించుకున్నట్లు వస్తున్న వార్తలు ఆయన తోసిపుచ్చారు. అయితే జాయింట్‌ కలెక్టర్‌ ఢిల్లీరావుకు పరీక్షలు చేయించామని, ఆయనకు నెగిటివ్‌ రిపోర్టు వచ్చినట్లు కలెక్టర్‌ తెలిపారు. (కరోనా ఆస్పత్రిగా కిమ్స్ సవీరా)

కరోనా కట్టడి కోసం మరిన్ని పకడ్భందీ చర్యలు చేపట్టినట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు. రోళ్ల తహశీల్దార్ దంపతులకు కరోనా పాజిటివ్ రావటంతో ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా జాయింట్ కలెక్టర్ ఢిల్లీరావుకు కరోనా పరీక్షలు నిర్వహించామని.. నెగిటివ్ రిపోర్ట్స్ వచ్చాయన్నారు. కిమ్స్-సవేరా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కరోనా పాజిటివ్ రోగులను స్వయంగా పరామర్శించిన కలెక్టర్ ... వారికి ధైర్యంగా ఉండాలని సూచించారు. ప్రజలంతా ఇంటికే పరిమితం అయితే కరోనా ను జయించవచ్చని తెలిపారు. (కరోనా: నిర్లక్ష్యం వైరస్)

21 పాజిటివ్‌ కేసులు నమోదు
జిల్లాలో ఇప్పటివరకూ 21 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు అయినట్లు కోవిడ్‌-19 ప్రత్యేక అధికారి విజయానంద్‌ తెలిపారు. అలాగే పాజిటివ్‌ వ్యక్తులు కలిసినవారి వివరాలు సేకరిస్తున్నట్లు చెప్పారు. 300మంది క‍్వారంటైన్‌ కేంద్రాల్లో చికిత్స పొందుతున్నారని, అనంతపురం, హిందూపురం పట్టణాల్లో రెడ్‌ జోన్లు ఏర్పాటు చేసినట్లు విజయానంద్‌ పేర్కొన్నారు. మే 3 వరకూ జరిగే లాక్‌డౌన్‌కు ప్రజలంతా సహకరించాలని కోరారు. 

మరిన్ని వార్తలు