చంద్రబాబుకు అనంతపురం టీడీపీ నేతల షాక్‌!

15 Jun, 2020 19:55 IST|Sakshi

సాక్షి, అనంతపురం: జేసీ బ్రదర్స్‌ అవినీతి బండారం బయటపడిన నేపథ్యంలో వారికి అండగా నిలబడాలన్న టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుకు సొంత పార్టీ నేతలే ఝలక్‌ ఇచ్చారు. జేసీ కేసులో ఆయన రాంగ్‌ స్టెప్‌ వేశారంటూ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో జేసీ కుటుంబాన్ని పరామర్శించడానికి టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ అనంతపురం జిల్లా తాడిపత్రికి రాగా.. ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్‌, మాజీ మంత్రి పరిటాల సునీత లోకేష్‌ పర్యటనకు దూరంగా ఉన్నట్లు సమాచారం. (ఫోర్జరీ పత్రాల్లో సంతకాల ఆధారంగానే కేసులు)

అదే విధంగా మాజీ ఎమ్మెల్యేలు ప్రభాకర్‌ చౌదరి, ఉన్నం హనుమంతచౌదరి, జితేంద్ర గౌడ్‌, కందికుంట ప్రసాద్‌ సైతం వీరి బాటలో నడుస్తున్నట్లు తెలుస్తోంది. ఫోర్జరీ డాక్యుమెంట్లతో అక్రమ రిజిస్ట్రేషన్లు చేసి అడ్డంగా దొరికిపోయిన జేసీ కుటుంబంపై సానుభూతి ఎందుకంటూ టీడీపీ నేతలు చర్చించుకుంటున్నారు. ఈ క్రమంలో జిల్లా నేతలంతా లోకేష్‌ వెంటే ఉండాలంటూ ఎన్టీఆర్‌ భవన్‌ నుంచి మెసేజ్‌లు రావడంతో.. టీడీపీ ముఖ్య నాయకులంతా ఫోన్లు స్విచ్చాప్‌ చేసి ఇంటికే పరిమితమైనట్లు తెలుస్తోంది. కాగా.. బీఎస్‌-3 వాహనాలను బీఎస్‌-4గా రిజిస్ట్రేషన్‌ చేయించి అక్రమాలకు పాల్పడిన జేసీ ప్రభాకర్‌ రెడ్డి, జేసీ అస్మిత్‌ రెడ్డిలను అరెస్టు చేసిన పోలీసులు.. ప్రస్తుతం వారిని కడప సెంట్రల్‌ జైలుకు తరలించిన విషయం విదితమే.(‘జేసీ బ్రదర్స్‌’ బాగోతం.. బిగుస్తున్న ఉచ్చు)

మరిన్ని వార్తలు