హంద్రీనీవా ప్రాజెక్టుకు అనంత వెంకటరెడ్డి పేరు

4 Jun, 2020 20:39 IST|Sakshi
హంద్రీనీవా ప్రాజెక్టు(ఫైల్‌)

సాక్షి, అనంతపురం : హంద్రీనీవా ప్రాజెక్టుకు అనంత వెంకటరెడ్డి పేరును పునరుద్ధరిస్తూ ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అనంత వెంకటరెడ్డి హంద్రీనీవా సుజల స్రవంతిగా పేరును పునరుద్ధరిస్తూ.. ఏపీ జలవనరుల శాఖ ప్రధాన కార్యదర్శి ఆదిత్య నాథ్ దాస్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హంద్రీనీవా ప్రాజెక్టుకు 2007లో అనంత వెంకటరెడ్డి పేరు పెట్టారు. ఆ తర్వాత 2014లో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు సర్కార్‌ 2015లో ప్రాజెక్టుకు ఆయన పేరును తొలగించింది.

కరవు ప్రాంతాలకు కృష్ణా జలాలు తరలించాలని కోరుతూ అనేక ఉద్యమాలు చేసిన మాజీ ఎంపీ దివంగత అనంత వెంకటరెడ్డి జ్ఞాపకార్థం హంద్రీనీవా ప్రాజెక్టుకు ఆయన పేరును పునరుద్ధరించింది సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం. ఈ నేపథ్యంలో అనంత వెంకటరెడ్డి తనయుడు అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ కృతజ్ఞతలు తెలిపారు.

మరిన్ని వార్తలు